/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-and-bandi-sanjay-2026-05-13-14-38-57.jpg)
Bandi Bhagirath and Bandi sanjay
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణ హాజరు కావాలని భగీరథ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ బండి భగీరథ్ విచారణకు హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వలంటూ భగీరథ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు.
మరోవైపు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలనిమంగళవారం సీపీఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ దీనిపై మాట్లాడారు. పోక్సో కేసు నమోదై 36 గంటలు గడిచినా నిందితుడిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ ఫైర్ అయ్యారు. గతంలో కూడా భగీరథ్ అనేక కేసుల్లో ఇరుక్కున్నాడని తెలిపారు. 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే మళ్లీ డీజీపీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు.
Follow Us