Hydra: హైడ్రాకు 5,800 ఫిర్యాదులు.. 200 ఎకరాల ప్రభుత్వ భూమి!

హైడ్రా వార్షిక నివేదికను ఏవీ రంగనాథ్‌ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. 8 చెరువులు, 12 పార్కులతోపాటు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందన్నారు. వాతావరణ సమాచారం తెలిపేందుకు త్వరలో హైడ్రా FM తీసుకొస్తామన్నారు.

New Update
AV Ranganath: రంగనాథ్ హీరో.. జీహెచ్ఎంసీ జీరో..! హైడ్రా దూకుడుతో పోలీసోడికి జనం జేజేలు

AV Ranganath (Hydra)

Hydra: హైదరాబాద్‌లో సంచలనం రేపిన హైడ్రా వార్షిక నివేదికను ఏవీ రంగనాథ్‌ రిలీజ్ చేశారు. హైడ్రా మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అందులో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందని చెప్పారు. ఇక హైడ్రా కారణంగా ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రజలకు మరింత అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. 

ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్‌..

ఈ మేరకు రంగనాథ్ మాట్లాడుతూ.. అక్రమనకు గురైన 8 చెరువులు, 12 పార్కులను హైడ్రా రక్షించింది. టెక్నాలజీని ఉపయోగించి చెరువుల బార్డర్ లో బఫర్‌జోన్‌లు మార్క్ చేస్తున్నాం. NRSE సహకారంతో శాటిలైట్‌ ఫొటోస్ పరిశీలిస్తున్నాం. ఏరియల్‌ డ్రోన్‌ చిత్రాలనుకూడా సేకరిస్తాం. ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాలాలకు కిర్లోస్కర్‌తో సమన్వయం చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Pawan: అల్లు అర్జున్ ఇష్యూపై తొలిసారి స్పందించిన పవన్.. వారిపై ఫైర్!

హైడ్రా ఎఫ్‌ఎమ్‌..

ఇక మున్సిపాలిటీల్లో అనధికార నిర్మాణాలపైనే అధికంగా ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. భూములను కాపాడటంతోపాటు వరద నివారణ చర్యలు తీసుకుంటాం. హైడ్రాకు డాప్లర్‌ రాడార్‌ను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలిపేందుకు త్వరలో ఒక హైడ్రా ఎఫ్‌ఎమ్‌ ఛానెల్‌ తీసుకొస్తామని రంగనాథ్ చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment