Paid Subscription: పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ....ఇక అందాల ఆరబోతే

ఇటీవల కాలంలో సినీ తారలు, సెలబ్రిటీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎంచుకుంటున్న 'పెయిడ్ సబ్‌స్క్రిప్షన్' మార్గం హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న భామలు తమ ఫాలోవర్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ సరికొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.

New Update
FotoJet - 2026-04-24T080608.254

Ashu Reddy

 Paid Subscription : ఇటీవల కాలంలో సినీ తారలు,సోషల్ మీడియా సెలబ్రిటీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎంచుకుంటున్న 'పెయిడ్ సబ్‌స్క్రిప్షన్' మార్గం హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న భామలు తమ ఫాలోవర్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ సరికొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి కూడా చేరారు.ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగిన అషు రెడ్డి, తన ఫాలోవర్ల కోసం 'ఎక్స్‌క్లూజివ్ కంటెంట్' పేరిట ఈ ఫీచర్‌ను ప్రారంభించారు.నెలకు రూ. 399 చెల్లించి ఆమె సబ్‌స్క్రైబర్ కావాల్సి ఉంటుంది.

171370-ashu-reddy-2

 సాధారణ ఫాలోవర్లకు కనిపించని ప్రత్యేకమైన ఫోటో షూట్స్, వీడియోలు, పర్సనల్ అప్‌డేట్స్ ఈ పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.ఈ ఫీచర్ ప్రారంభించిన మొదటి రోజే దాదాపు 700 మందికి పైగా సబ్‌స్క్రైబ్ చేసుకోవడం గమనార్హం. అంటే ఒక్క రోజులోనే ఆమె సుమారు రూ. 3 లక్షల వరకు ఆదాయాన్ని గడించినట్లు అంచనా.ఇప్పటికే బుల్లితెర నటి విష్ణుప్రియ, సినీ నటి అనన్య నాగళ్ల వంటి వారు ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ బాటలో నడిచారు. తమ వ్యక్తిగత ఫోటోలు, గ్లామరస్ వీడియోలను చూడాలంటే డబ్బులు చెల్లించాలనే నిబంధన పెట్టి, సోషల్ మీడియా ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకుల ఇంటర్వ్యూలతో పాపులర్ అయిన అషు రెడ్డి, తనకున్న క్రేజ్‌ను ఈ విధంగా వ్యాపారంగా మార్చుకున్నారు.

Ashu-Reddy-17-2024-04-f2e28d4af88255b4efa228e03a238033

ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం డబ్బు కోసం అసభ్యతను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.ఇలాంటి విధానాలు సమాజంపై, ముఖ్యంగా యువతపై చెడు ప్రభావం చూపుతున్నాయని పలువురు సామాజిక కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలతో నటి విష్ణుప్రియపై కేసు నమోదైనట్లు సమాచారం. అషు రెడ్డి విషయంలో కూడా అభ్యంతరకర కంటెంట్ ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

Ashu-Reddy-60-2024-07-32211812c4a133d24d097f91305c073f

ఒకప్పుడు కేవలం వెండితెరపై మాత్రమే కనిపించే తారలు, ఇప్పుడు అరచేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారా నేరుగా ప్రేక్షకులకు చేరువవుతున్నారు. అయితే, ఈ చేరువ కాస్తా ఆదాయ వనరుగా మారి 'అందాల విందు'కు వేదికగా మారడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఇది సెలబ్రిటీల వ్యక్తిగత ఇష్టమని సమర్థిస్తుంటే, మరికొందరు దీనిని ఒక రకమైన 'డిజిటల్ వ్యభిచారం'గా అభివర్ణిస్తూ మండిపడుతున్నారు. ఈ ట్రెండ్ ఇంకా ఎంతమందిని ఆకర్షిస్తుందో, దీనిపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధిస్తుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు