/rtv/media/media_files/2025/03/11/tXwdBpnCRVk8QeW7wRxI.jpg)
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పును అమృత స్వాగతిస్తూ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ఆరేళ్లుగా న్యాయం కోసం పోరాడిన అమృత కోర్టు తీర్పుతో ప్రణయ్ ఆత్మకు శాంతి కలిగిందంటూ కామెంట్ చేసింది. కాగా ప్రణయ్, అమృత ప్రేమ వివాహం చేసుకోగా అమృత తండ్రి మారుతీరావు 2018లో సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చెయించాడు. ఈ కేసులో జైలుశిక్ష అనుభవించిన అనంతరం మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తానికి ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Also Read : ప్రణయ్ హత్యకేసులో అమృత చెల్లి ఆవేదన.. ‘అంతా అమృతే చేసింది’
నిందితులు వీళ్లే!
ప్రణయ్ హత్యకేసులో A1 తిరునగరు మారుతీరావు, A2 బీహార్‌కు చెందిన సుభాష్‌శర్మ, A3 అజ్గర్‌అలీ, A4 అబ్ధుల్‌బారీ, A5 ఎం.ఏ కరీం, A6 తిరునగరు శ్రవణ్‌కుమార్, A7 శివ, A8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు. సుభాష్‌శర్మ (ఏ-2), అస్గర్‌అలీ(ఏ-3) విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు.
Also Read : హైదరాబాద్‌లో విషాదం.. పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్య
కోర్టు తీర్పుపై హర్షం
ప్రణయ్ మర్డర్ జరిగినప్పుడు నల్గొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. నేరస్థులకు శిక్ష పడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఆయన హైడ్రా కమిషనర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2018 సెప్టెంబర్ 14 ఘటన జరగగా.. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈరోజు కోర్టు ఆఖరి తీర్పు ఇచ్చింది.
Also read : మండుతున్న ఎండల్లో వాతావరణశాఖ చల్లటి వార్త.. 3 రోజులపాటు వానలే..వానలు!
Also Read : రిటైర్మెంట్ పై రోహిత్, కోహ్లీ క్లారిటీ.. ఫ్యాన్స్ కు పండగే!