/rtv/media/media_files/2025/03/10/iexId7Z4qotJhO84WFKE.jpeg)
pranay murder case Photograph: (pranay murder case)
ఆ పాపానికి ఐదేళ్ల తొమ్మిది నెలలు.. దానికి ఒడిగట్టిన వాడికి చట్టపరంగా తీర్పు రాకముందే శిక్ష పడింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశహ్యప్తంగా సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ హత్య కేసులో సోమవారం (ఈరోజు) నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న హత్యకు ప్రణయ్ గురయ్యాడు. గర్భవతిగా ఉన్న భార్య అమృతను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి.. తిరిగి వస్తుండగా.. దుండగులు ప్రణయ్‌పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఇది ఒక పరువు హత్య.. తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ను హత్య చేయించాడు.
Also read: Weather alert: రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాలో ప్రజలు జాగ్రత్త
మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్, తిరునగర్ అమృత వర్షిణి స్కూల్ నాటి నుంచి స్నేహితులు. పెరుగుతున్న వయసు కొద్దీ వారి స్నేహం ప్రేమగా మారి పెళ్లి కోసం పెద్దలను ఎదిరించే స్థాయికి చేరుకుంది. ప్రయణ్‌ది తక్కువ కులమని అమృత వాళ్ల ఇంట్లో పెళ్లికి అంగీకరించలేదు. అయినా సరే అమృత తల్లిదండ్రులను ఎదిరించి ప్రణయ్‌ను ప్రేమవివాహం చేసుకుంది. అమృత గర్భం దాల్చింది. అంతా బాగుందనుకున్న టైంలో వారి జీవితంలో అమృత తండ్రి మారుతిరావు విలన్‌లా ఎంట్రీ ఇచ్చాడు. అమృతను హాస్పిటల్ చెక్‌అప్ కోసం తీసుకెళ్లి వస్తున్న ప్రణయ్‌ను ఆమె తండ్రి డబ్బులిచ్చి మరర్డ్ చేయించారు. హాస్పిటల్ గేటు బయటే ప్రణయ్‌ని కత్తితో నరికి హత్య చేశారు. తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుఫారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించాడు.
Also read: Champions Trophy 2025: టీమిండియా ఫ్యాన్స్‌పై రాళ్ల దాడి.. అర్థరాత్రి అల్లర్లు
ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఈ కేసులో మారుతిరావుతో సహా మొత్తం ఎనిమిది నిందితులపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ నడుస్తుండగానే ఆత్మహత్యకు ఏ1 నిందితుడు మారుతీరావు పాల్పడ్డాడు. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి, తల్లి ప్రేమలత, భార్య అమృతవర్షిణి నుంచి వివరాలను కోర్టు నమోదు చేసుకుంది. తుది తీర్పుపై ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ కేసు పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించింది. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తిచేసి హత్యకేసుల్లో ఎనిమిది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించింది. 2019 జూన్ 12న చార్జిషీట్ దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌కోర్టు విచారణ ప్రారంభించింది. 5సంవత్సరాల 9నెలల కాలం పాటు విచారణ కొనసాగగా, పోలీస్ శాఖ సమర్పించిన చార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్‌లతోపాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును ఈ రోజుకు రిజర్వు చేసింది.
ప్రణయ్ హత్యకేసులో A1 తిరునగరు మారుతీరావు, A2 బీహార్‌కు చెందిన సుభాష్‌శర్మ, A3 అజ్గర్‌అలీ, A4 అబ్ధుల్‌బారీ, A5 ఎం.ఏ కరీం, A6 తిరునగరు శ్రవణ్‌కుమార్, A7 శివ, A8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు. సుభాష్‌శర్మ (ఏ-2), అస్గర్‌అలీ(ఏ-3) విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు. ప్రధాన నిందితుడు మారుతీరావు 2020మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.