ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది మహాకుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తాజాగా ప్రయాగ్‌రాజ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి సంబంధించి పలు ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈసారి జరగనున్న మహాకుంభమేళాలో తొలిసారిగా ఏఐ, చాట్‌బాట్ సేవలు వినియోగించుకోబోతున్నామని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్ ఫైర్ టెండర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇది కూడా చూడండి: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్ మహాకుంభమేళాకు దేశ ప్రజలందరూ తరలిరావాలని ప్రధాని పిలుపునిచ్చారు. '' ప్రయాగ్‌రాజ్.. భూమిపై కొత్త చరిత్ర సృష్టించబోతోంది. మహాకుంభమేళాతో దేశం సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితికి చేరుకుంటుంది. ఈ వేడుకను ప్రపంచ దేశాలు చర్చించుకునే విధంగా ఘనంగా నిర్వహిస్తాం. భారతదేశం అంటేనే పవిత్ర స్థలాలకు పుట్టినిల్లు లాంటిదని '' ప్రధాని మోదీ అన్నారు. ఇది కూడా చూడండి: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే! ఇదిలాఉండగా.. మహాకుంభమేళాలో అత్యవసర సమయాల్లో సిబ్బంది చేరుకోని ప్రాంతాలకు వెళ్లడం కోసం మూడు రోబోటిక్ ఫైర్ టెండర్లను ఉపయోగించనున్నామని అధికారులు తెలిపారు. ఈ రోబోలు మెట్లు ఎక్కడంతో సహా మంటలకు కూడా అదుపు చేస్తాయని చెప్పారు. అలాగే 35 మీటర్ల ఎత్తు నుంచి నీటిని స్ర్పే చేసే ఆర్టిక్యూలేటింగ్ వాటర్ టవర్‌లు, అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అయితే అగ్నిమాపక సేవల కోసం గత కుంభమేళా కోసం కేంద్రం రూ.6కోట్లు కేటాయించగా.. ఈసారి దాన్ని రూ.67 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు. Also Read: భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే? ఇది కూడా చూడండి: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం