Telangana: కొమురం భీం జిల్లాలో ఏనుగు భీభత్సం..ఇద్దరు రైతులు మృతి
ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో ఓ ఏనుగు భీభత్సం సృష్టిస్తోంది. నిన్న ఒక రైతు మీద, ఇవాళ ఒక రైతు మీద దాడి చేసి చంపేసింది. పొలాల్లో పనులు చేసుకుంటున్న వారి మీద అటాక్ చేస్తోంది ఏనుగు.
ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో ఓ ఏనుగు భీభత్సం సృష్టిస్తోంది. నిన్న ఒక రైతు మీద, ఇవాళ ఒక రైతు మీద దాడి చేసి చంపేసింది. పొలాల్లో పనులు చేసుకుంటున్న వారి మీద అటాక్ చేస్తోంది ఏనుగు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మరో ఐదుగురు తెలంగాణ మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ హైకమాండ్ తో కోమటిరెడ్డి టచ్ లో ఉన్నారని.. ఆయనే షిండే అని అన్నారు.
జలుబు, జ్వరం వచ్చినప్పుడు మనం తరచుగా మెడికల్ స్టోర్లలో మందులు కొని వాటిని వినియోగిస్తాం. అయితే ఈ మందుల్లో కూడా నకిలీవి ఉంటాయని మీకు తెలుసా? కొంతమంది ఫేక్‌గాళ్లు మృత్యువుతోనే వ్యాపారం చేస్తున్నారు. ఫేక్ మందులపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే లోకసభ అభ్యర్థుల 8వ జాబితాను కాంగ్రెస్ బుధవారం రాత్రి ప్రకటించింది. 14మంది కూడిన జాబితాను రిలీజ్ చేసింది. అందులో తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో ఎండలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో హోలీ ఆడిన తర్వాత స్నానం కోసం చెరువుకి వెళ్లిన ఓ బాలుడు (10) మృతి చెందాడు. అలాగే కొమురం భీం జిల్లాలో మరో నలుగురు యువకులు హోలీ ఆడిన అనంతరం నదిలో స్నానానికి వెళ్లి గల్లంతై మృతి చెందారు.
హోలీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతై మృతి చెందారు. ఫోన్లు, దుస్తుల ఆధారంగా యువకులు సంతోష్, కమలాకర్, సాయి, ప్రవీణ్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు.. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ మారుతారా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది.
మంచిర్యాల ఆర్డీవో కార్యాలయ ఆస్తుల జప్తు కలెక్టర్ జోక్యంతో చివరినిమిషంలో ఆగింది. కలెక్టర్ జోక్యంతో కోర్టు సిబ్బంది వెనుదిరిగారు. భూనిర్వాసితులకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని లేకుంటే కార్యాలయ ఆస్తులను జప్తు చేస్తామని ఆర్డీఓ వాడాల రాములుకు తెలిపారు.