/rtv/media/media_files/2025/03/02/Cgemc80HOk2eOi9D3ih5.jpg)
banny mama Photograph: (banny mama)
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేబీఆర్ పార్క్ ప్రాజక్ట్‌కు వ్యతిరేఖిస్తూ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో తన ఇంటిని కూల్చొద్దని ఆయన కోరారు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌తో పాటు మరో నాలుగు పిటిషన్‌లు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్దిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసులను రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు.
Also Read : చర్చ్ ముందే నలుగురు మృతి.. హైటెన్షన్ వైర్లకు తగిలి మలమల మాడిపోయారు
ట్రాఫిక్‌ను నివారించేందుకు, పర్యావరణ పరంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ ఇప్పటికే ప్రజావాణిలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి దరఖాస్తు చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి , సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తోపాటు పలువురు సినీ ప్రముఖుల ఇండ్లు కూడా కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి.
Also read : AP Assembly: కళ్లు చదిరేలా ఏపీ హైకోర్టు, అసెంబ్లీ భవనాలు.. టెండర్లుకు నోటిఫికేషన్