/rtv/media/media_files/2025/03/20/6ZvQo8dLuYFpLuyMzrRn.jpg)
T. Harish Rao
Phone Tapping Case: మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు కు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్థిరాస్తి వ్యాపారి చక్రధరగౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీశ్‌రావుతో పాటు రాధాకిషన్‌రావుపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో వారిద్దరినీ నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగియగా.. నేడు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: IPL 2025: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ
బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ పెట్టిన అక్రమ కేసును హైకోర్టు కొట్టివేస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చింది.పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై 2024 డిసెంబర్లో కేసు నమోదు అయింది. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా, కనీసం విచారణ కూడా చేయకుండా పోలీసులు FIR ఫైల్ చేశారని కోర్టు అభిప్రాయపడింది. దీంతో తనపై కుట్రపూరితంగా తప్పుడు కేసు నమోదు చేశారని హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టులో సాగిన సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఈరోజు తుదితీర్పును వెలువరించింది.హరీష్ రావుపై నమోదు చేసిన కేసులో ఎలాంటి ఆధారాలు లేని కారణంగా కేసును కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికి కేసులతో వేధించాలనుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక గుణపాఠమని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: టెస్లా కార్లు తగలబెట్టడం ఉగ్రవాద చర్యే: మస్క్!
ఇదిలా ఉండగా.. సిద్దిపేట జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్.. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని.. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావులపై గతేడాది ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పంజాగుట్ట పోలీసులు.. హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సహా ముగ్గురి అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేశారని పిటిషనర్ చక్రధర్ గౌడ్ తెలిపారు. ఒక రైతుకు తెలియకుండా అతని పత్రాలతో హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సిమ్‌కార్డు కొనుగోలు చేశారని.. ఆ సిమ్‌ను ఉపయోగించి తనకు బెదిరింపు కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. ఇక ఈ కేసులో ఏ-1గా హరీష్ రావు, ఏ-2గా రాధాకిషన్ రావులు ఉన్నారు.
Also Read: ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
కాగా చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘటనలో గతంలో హరీష్‌రావు దగ్గర పనిచేసిన వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ చేశారు. వీరు చక్రధర్ గౌడ్‌కు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు పంపుతూ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు ఆరోపించారు. చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ముగ్గురు కలిసి ఒక రైతు డాక్యుమెంట్స్ తో సిమ్ కార్డు కొనుగోలు చేసారు. ఆ తర్వాత రైతుకు తెలియకుండానే ఆయన డాక్యుమెంట్స్ ను సిమ్ కార్డు కోసం ఉపయోగించారన్నారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్ లు చేసారన్నారు.
Also Read: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!
అయితే బెయిల్‌పై విడుదలైన శంశీకృష్ణ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.కేవలం మాజీ మంత్రి హరీష్ రావు పేరు చెప్పాలని తమను పోలీసులు ఇబ్బందులు గురి చేశారన్నారు. గతంలో హరీష్ రావు పేషీలో చేశానని అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. తమపై ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్ దగ్గర కూడా గతంలో తాను పనిచేసినట్లు తెలిపారు. చక్రధర్ గౌడ్ ఎన్ని మోసాలు చేశాడో తనకు తెలుసన్నారు. అవన్నీ కూడా ఎప్పుడు బయట పెట్టలేదని.. ఇప్పుడు అన్ని విషయాలు బయట పెడుతానని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసే అంత స్థాయి తమది కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాగైనా హరీష్ రావు పేరు చెప్పించాలని ఉద్దేశంతో తమను వేధింపులకు గురి చేశారని చెప్పారు. పోలీసుల వేధింపులపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని.. విచారణ పేరుతో గంటల తరబడి తమను వేధింపులు గురి చేశారని వాపోయారు. ‘‘హరీష్ రావు పేరు చెప్పకపోతే నీకు జీవితం ఉండదు, నీ ఉద్యోగం లేకుండా చేస్తామని డీసీపీ, ఏసీపీ బెదిరింపులకు దిగారు. నా కుటుంబ సభ్యులను డీసీపీ పరుష పదజాలంతో దూషించారు. పోలీసుల టార్గెట్ ఒకటే హరీష్ రావు పేరు మా నోట చెప్పించాలని ’’ అని చెప్పుకొచ్చారు.
Also Read: Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది