/rtv/media/media_files/2026/02/23/fotojet-46-2026-02-23-20-17-45.jpg)
A friend was hacked to death on the street for allegedly practicing witchcraft..
Crime : వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో తన స్నేహితుడితే నరికి చంపాడో వ్యక్తి. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే తన స్నేహితుడైన ఆటో డ్రైవర్ సాయిలు (45)ను నరికి చంపాడు.
తాను ఆర్థికంగా నష్టపోవడానికి సాయిలు చేసిన చేతబడి కారణమని అనుమానంతో నిందితుడు బాలప్ప కక్ష పెంచుకుని సాయిలును హత్య చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. సాయిలును నరికి చంపిన తర్వాత బాలప్ప చేతిలో రక్తంతో తడిచిన కత్తిని అలాగే పట్టుకుని అక్కడే ఉండటంతో అంతా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు వచ్చిన తర్వాత లొంగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలప్పను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆధునిక కాలంలో ఇంకా మూఢనమ్మకాలు, చేతబడులను నమ్మడం నేటి సమాజము వెనుబాటు తనానికి నిదర్శనంగా నిలుస్తోంది. చేతబడుల అనుమానం రోజురోజుకు పెరిగి చివరకు దాడులు చేసే వరకు వెళ్తోంది. ఇంకా ముదిరితే ఇలా మర్డర్ చేసే వరకు వెళుతోంది.
Follow Us