TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచే  ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు  42 శాతం  రిజర్వేషన్లను కల్పించేలా బిల్లును రూపొందించారు.  

author-image
By Manogna alamuru
New Update
Telangana Cabinet: ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet

నిన్న జరిగిన సమావేశంలో  పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది తెలంగాణ కేబినెట్. అందులో మొదటి బీసీల రిజర్వేషన్ బిల్లు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచే  ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు  42 శాతం  రిజర్వేషన్లను కల్పించేలా బిల్లును రూపొందించారు.  విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండో బిల్లు ముసాయిదా తయారు చేశారు అధికారులు. వేర్వేరుగా ఈ రెండు  బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని  రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. 2017 లో అసెంబ్లీ ఆమోదించిన  రిజర్వేషన్ల పాత బిల్లును వెనక్కి తీసుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లు..

దాంతో పాటూ ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ కులాల వర్గీకరణ పై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్  కమిషన్ మార్చి 2 వ తేదీన తమ రెండో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ ఇచ్చిన మొదటి నివేదికలో చేసిన సిఫారసులను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యధాతధంగా ధ్రువీకరించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన 71 విజ్ఞప్తులను రెండో విడత లో కమిషన్ పరిశీలించింది. కమిషన్ ఇచ్చిన నివేదిక లోని అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. దీంట్లో న్యాయ పరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదా కు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఫ్యూచర్ సిటీ..

ఇక  తెలంగాణ రాష్ట్రాన్ని కోర్, అర్బన్, రూరల్‌ సెక్టార్లుగా విభజించిన ప్రభుత్వం.. రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) బఫర్‌ (2 కి.మీ.) వరకు హెచ్‌ఎండీఏ ప్రాంతం పరిధిని విస్తరించింది. దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఫ్యూచర్‌ సిటీ ప్రాంత అభివృద్ధి అథారిటీ ఎఫ్‌సీడీఏ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కి  కూడా ఆమోదం తెలిపింది కేబినెట్. శ్రీశైలం హైవే - నాగార్జునసాగర్ హైవే మధ్య ప్రాంతంలో ఓఆర్ఆర్ వెలుపలి నుంచి ఆర్ఆర్ఆర్ బయట 2 కిలోమీటర్ల ప్రాంతం వరకు దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ విస్తరించి ఉండనుంది. 

ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారికీ కిందకు బదిలీ చేస్తూ తీర్మానించారు. ఫ్యూచర్ సిటీ మొత్తంగా 7 మండలాలు, 56 గ్రామాలతో విస్తరించి ఉంటుంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 90 పోస్టులను మంజూరు చేస్తూ ఆమోదించింది.హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆర్ఆర్ఆర్ అవతల 2 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏను విస్తరించారు. 11 జిల్లాల్లో 104 మండలాల్లో 1355 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి.

Also Read: Pakistan: టెర్రరిజంలో పాకిస్తాన్ 2వ స్థానంలో...భారత్ 14వ స్థానంలో...

Advertisment
Advertisment
Advertisment