/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
Trains Cancelled: ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో 30 రైళ్లను వేర్వేరు తేదీల్లో రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ సీపీఆర్వో శ్రీధర్ గురువారం ప్రకటించారు. కాజీపేట-డోర్నకల్,డోర్నకల్-విజయవాడ,భద్రాచలంరోడ్డు- విజయవాడ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 10 నుంచి 20 వరకు రద్దు చేశారు.
11 రోజుల పాటు...
గోల్కొండ,భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్‌ప్రెస్ లు వారం నుంచి 11 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. 9 రైళ్లను దారి మళ్లించి నడపనున్నారు. నాలుగు రైళ్లు 60-90 నిమిషాల పాటు ఆలస్యంగా బయల్దేరనున్నాయి.
Also Read:Gold and silver prices : బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ రికార్డు...ఈ రోజు బంగారం ధర ఎంతంటే ?
రద్దు చేసిన రైళ్లు...తేదీలు ఎప్పుడంటే..సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ 11 నుంచి 21 వరకు రద్దు చేస్తున్నట్లు సమాచారం.
సికింద్రాబాద్ -సిర్పూర్ కాగజ్‌నగర్ రైలు రద్దు చేయడం జరిగింది.
భాగ్య నగర్ ఎక్స్‌ప్రెస్ ని ఈ నెల 10 నుంచి 21 వరకు సుమారు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
గుంటూరు -సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ని 10,11,15,18,19,20 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్‌ప్రెస్ 11,14, 16,18,19,20 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
అలాగే రద్దు అయిన రైళ్ల జాబితాలో ఇంకా చాలా రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్- విశాఖ పట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుని కూడా 19,20 తేదీల్లో 75 నిమిషాలు ఆలస్యంగా ,ఆదిలాబాద్ -తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ 9,11,14, 18,19 తేదీల్లో గంటన్నర పాటు ఆలస్యంగా నడవనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read:R.Krishnaiah : రిజర్వేషన్లు కల్పించకుంటే సంకుల సమరమే-- ఆర్. కృష్ణయ్య సంచలన సంచలన ప్రకటన