తెలంగాణలో మూడు కీలక బిల్లులు ఆమోదం..

తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ వర్సిటీ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులను ఆమోదించింది.

New Update
Assembly

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చ జరపాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మంగళవారం జరిగిన సమావేశాల్లో కూడా ఈ ఘటనపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో మరోసారి గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, బీపీపీ సభ్యుల ఆందోళనల మధ్యే అధికార పక్షం మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ వర్సిటీ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులను ఆమోదించింది. 

Also read: మహిళలకు గుడ్‌న్యూస్.. 10పాసైతే చాలు వేలల్లో ఆదాయం..కొత్త స్కీమ్ సూపర్?

సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఈ మూడు బిల్లులకు ఆమోదం లభించింది. రాష్ట్ర పర్యాటక విధానంపై కూడా కొంతసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత సభ బుధావారానికి వాయిదా పడింది. ఇదిలాఉండగా.. సభను బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్పీకర్‌ పర్మిషన్‌తో అప్పులపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సమావేశాల్లో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలు నిర్వహించగా.. హరీశ్‌రావు, భట్టి విక్రమార్క మధ్య వాదనలు కొనసాగాయి.  

Also Read: లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు.. ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రూ.1.27 కోట్లు అప్పులు చేసిందని హరీశ్‌ రావు ఆరోపించారు. వీళ్ల ఐదేళ్ల పాలన పూర్తయ్యేసరికి అప్పులు 6.36 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆరోపించారు. బీఆర్ఎస్‌ హయాంలో జరిగిన అప్పులపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేశారంటూ ధ్వజమెత్తారు.  తమ హయాంలో రూ.4,17,496 కోట్లు మాత్రమే అప్పు ఉందని .. కానీ రూ.7లక్షల కోట్లకు పైగా మేము అప్పులు చేశామంటూ ప్రచారం చేశారని ఆరోపించారు. 

ఆ తర్వాత భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని సభలోనే శ్వేతపత్రం కూడా విడుదల చేశామని తెలిపారు. తాము ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి అప్పులు చేయడం లేదని అన్నారు. స్పీకర్ పర్మిషన్‌తో ఈ విషయంపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

Also Read: 22 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌లో చిక్కుకున్న మహిళ.. ఎట్టకేలకు భారత్‌లోకి

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment