Excises Police Stations : తెలంగాణలో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు....13 స్టేషన్లు అక్కడే...

తెలంగాణలో మద్యం, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో 13, వరంగల్ అర్బన్‌లో ఒకటి చొప్పున ఈ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

New Update
 Excise Police Station

Excise Police Station

Excises Police Stations :  తెలంగాణలో మద్యం, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో  కొత్తగా 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పటికే.. రాష్ట్రంలో 100 కొత్త పోలీస్ స్టేషన్‌లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుండగా.. ఇదే క్రమంలో కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ప్రతిపాదనకు మోక్షం లభించింది. హైదరాబాద్‌లో 13, వరంగల్ అర్బన్‌లో ఒకటి చొప్పున ఈ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. 2020లోనే ప్రతిపాదించిన ఈ స్టేషన్ల ఏర్పాటుకు ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు.. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ చెవ్వూరు హరి కిరణ్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అయితే.. ఈ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచే వీటిని ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. కొత్త స్టేషన్లు వెంటనే అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ అజయ్ రావు ఆదేశించారు.

ఇది కూడా చూడండి: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?

కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2020లోనే 14 కొత్త స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. అప్పటి నుంచి పలు అడ్డంకులు ఏర్పడుతూ వస్తుండగా.. ఎట్టకేలకు ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది. స్టేషన్ల విభజన, ప్రాంతాల ఎంపిక, సిబ్బంది బదిలీ వంటి పనులన్నీ పూర్తయ్యాయి. ప్రభుత్వ అనుమతులు రావడంతో ఎక్సైజ్ శాఖ వేగంగా చర్యలు తీసుకుంటోంది. "కొత్త పోలీస్ స్టేషన్లను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని.." అజయ్ రావు ఆయా డిప్యూటీ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త స్టేషన్ల కోసం అద్దె భవనాలను వెతకాలని కమిషనర్ ఆదేశించారు.

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

హైదరాబాద్‌ పరిధిలోని బంజారా హిల్స్, చిక్కడపల్లి, గండిపేట్, కొండపూర్, పెద్ద అంబర్‌పేట్, కూకట్‌పల్లి, అమీన్‌పూర్, హసన్‌పర్తి స్టేషన్లకు అద్దె భవనాలు దొరకగా.. మారేడ్‌పల్లి, మీర్‌పేట్‌, కొంపల్లి, కాప్రా, నాచారం, అల్వాల్ స్టేషన్లకు మాత్రం ఇంకా అద్దె భవనాలు దొరకలేదు. దీంతో వాటిని ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలోనే ప్రత్యేక గదుల్లో ఏర్పాటు చేయనున్నారు. కాగా.. ఈ కొత్త స్టేషన్లు ప్రారంభమైతే మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు