/rtv/media/media_files/2024/10/22/pCrxi2cVecHbon39St3k.jpg)
10th Exams
తెలంగాణలో ఈరోజు నుంచి ఏప్రిల్ 4 వరకు పదోతరగతి ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ పరీక్షల విభాగం చెప్పింది. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,650 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈసారి ఎగ్జామ్స్ కు 24 పేపర్ల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ప్రతీ కేంద్రానికి ఒకరు చొప్పున మొత్తం 2,650 మంది చీఫ్ సెపరింటెండెంట్లు ఉంటారన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష నిర్మిహించనున్నారు. తెలంగాణలో ఈసారి మొత్తం 5.09 లక్షల మంది పదోతరగతి పరీక్ష రాయనున్నారు. దాదాపు 30 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలుస్తోంది. విద్యార్థులు 5 నిమిషాల వరకూ ఆలస్యంగా వచ్చినా ప్రవేశం కల్పిస్తామన్నారు. పరీక్షలను సీసీ కెమరాల ద్వారా పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఎగ్జామ్ సెంటర్లోకిఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫన్లు, స్మార్ట్ వాచ్ లకు అనుమతి లేదు.
కాపీయింగ్ కు పాల్పడితే డిబార్..
పరీక్షల్లో విద్యార్థులు ఎవరైనా కాపీయింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వారిని మిగిలిన పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని ప్రకటించారు. పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులు, సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎగ్జామ్ ముగిసిన తర్వాతనే విద్యార్థులు, సిబ్బంది బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామన్నారు. మధ్యలో బయటకు పంపించమని స్పష్టం చేశారు.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!