Telangana : గోవాలో తెలంగాణ రాజకీయం తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక గోవాకు చేరుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల క్యాంపులతో గోవా నిండిపోయింది. ఓటర్లుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండడంతో వారిని కాపాడుకునేందుకు ఇరు పార్టీల పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. By Manogna alamuru 26 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Mahabubnagar MLC Election : బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) కండువాలతో గోవా నిండిపోయింది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల(Telangana Lok Sabha Elections) కు ముందు జరుగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు యుద్ధానికి రెడీ అవుతున్నారు. రెండు పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం దక్కించుకుని వచ్చే పార్లమెంటు ఎన్నికల(Parliament Elections) కు విజయంతో వెళ్ళాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ఎలా అయినా గెలవాలని తాపత్రయ పడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు... స్థానిక ఎమ్మెల్సీ నాయకుడిని ఎన్నుకోవడానికి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే ఓటర్లుగా ఉంటారు. అందుకే ఇప్పుడు ఎవరూ ఎటూ జంప్ చేయకుండా..కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు జాగ్రత్త పడుతున్నాయి. దీని కోసం నేతలను గోవాలో ఉంచి మరీ రాజకీయాలు నడుపుతున్నాయి. ఎలా అయినా సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ కూడా గోవాకు చేరుకుని నేతలకు కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు కేటీఆర్ భరోసా ఇస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు.. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 1439 ఓట్లు ఉండగా ఇందులో బీఆర్‌ఎస్‌కే దాదాపు 850 మెజార్టీ ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్‌కు 300 పైగా ఓటర్లు ఉన్నారు. అయితే పోలింగ్ రోజు ఏదైనా జరగొచ్చని అనుమానం ఉండడంతో ఇరు పార్టీల పెద్దలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా గోవా(Goa) లోనే క్యాంప్ పెట్టింది. సీఎం రేవంత్ సొంత జిల్లాలో ఎన్నిక కావడంతో... వారు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతకు ముందు ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రాస్‌లో చేరారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు కూడా. దీంతో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(MLC) స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. ఈ నెల 28న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. Also Read : Kavitha Case : కవితకు బెయిల్ ?? కోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ! #brs #congress #politics #goa #telanagna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి