Telangana : ఖమ్మం జిల్లాలో కలకలం.. సీఎం రేవంత్ న్యాయం చేయాలంటూ లైవ్ లో రైతు ఆత్మహత్య!

తన పొలాన్ని అక్రమించుకోనున్నారని ఎన్నో మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కలత చెందిన ఓ రైతు సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.

New Update
Telangana : ఖమ్మం జిల్లాలో కలకలం.. సీఎం రేవంత్ న్యాయం చేయాలంటూ లైవ్ లో రైతు ఆత్మహత్య!

Live Suicide : తన పొలాన్ని అక్రమించుకోనున్నారని ఎన్నో మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో... కలత చెందిన ఓ రైతు (Farmer) సెల్ఫీ వీడియో (Selfie Video) తీసుకుని మరి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. తన పొలాన్ని తనకు ఇప్పించాలని ఎన్నోమార్లు రైతు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా (Khammam District) చింతకాని మండలం ప్రొద్దుటూరులో తన పొలాన్ని వేరొకరు ఆక్రమించుకోవడంతో రైతు పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. తనకు న్యాయం జరగక పోవడంతో చనిపోతున్నానని తన ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి వీడియో ద్వారా తన ఆవేదనను తెలియజేస్తూ రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రొద్దుటూరు సర్వేనంబర్ 276, 277లో ఉన్న తన పొలాన్ని కొందరు పెద్ద మనుషులు ఆక్రమించి ట్రాక్టర్లు, జేసీబీలు, బుల్డోజర్లతో ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నారని రైతు వీడియోలో ఆరోపించారు. గ్రామానికి చెందిన కూరపాటి కిషోర్, పెండ్యాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు, మంగలి శ్రీను, ముత్తయ్యలు తన పొలాన్ని నాశనం చేశారని బాధిత రైతు వీడియోలో ఆరోపించాడు. తన పొలాన్ని కాపాడాలని వారిని ఎంతగా ప్రాధేయ పడినా వారు కనికరించలేదన్నారు.

తన పొలాన్ని బుల్డోజర్లతో తొక్కించారని చింతకాని ఎమ్మార్వో, ఎస్సైలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వస్తే, టైమ్ అయిపోయిందని చెప్పారని వీడియోలో వాపోయాడు. తనకు మరో మార్గం లేక చనిపోతున్నానని తనకున్న ఏడెకరాల పొలంలో మూడెకరాల పది కుంటల పొలాన్ని ఆక్రమించి ధ్వంసం చేశారని వివరించాడు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తనకు న్యాయం చేయాలని, రైతుగా బతికానని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని, తాను ఉన్నా లేకపోయినా తన కుటుంబానికి న్యాయం చేయాలని రైతు ఆ వీడియో లో వేడుకున్నాడు

Also read: పుణెలో జికా వైరస్ కలకలం‌.. ఇద్దరు గర్భవతులకు పాజిటివ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు