Mega DSC: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన

వచ్చే నెలలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అన్నారు.

New Update
Mega DSC: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన

Telangana Mega DSC Notification: తెలంగాణలోని నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy). ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ వేస్తామని అన్నారు. గత 10 ఏండ్లు గా టీచర్ పోస్టుల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన 2, 3 లక్షల మందికే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మిగతా వారికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు.

సీఎం రేవంత్ మార్క్..

తెలంగాణ రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనలో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అన్ని శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్. ఇటీవల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. పలు నిర్ణయాలను తీసుకొని అందరిని తన వైపు తిప్పుకుంటున్నారు.

రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని సీఎం ఆదేశంచారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలను తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ALSO READ: రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

మెగా డీఎస్సీ రంగం సిద్దం..

తెలంగాణలో ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ(Mega DSC) నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు.

ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో(Teacher Transfers) ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ముఖ్యమంత్రి సూచనలను చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴 BRS Silver Jubilee Meeting Live Updates: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. లైవ్ అప్డేట్స్!

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ హన్మకొండ జిల్లాలలోని ఎల్కతుర్తిలో జరగనుంది. ఈ సభలో కేసీఆర్ రేవంత్ సర్కార్ పై సమర శంఖం పూరించనున్నారు. సభ లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
BRS Public Meeting Warangal

BRS Public Meeting Warangal

  • Apr 27, 2025 12:34 IST

    బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మల్లారెడ్డి డ్యాన్స్



  • Apr 27, 2025 12:32 IST

    కోదాడ నుంచి సభకు బయలుదేరిన నేతలు



  • Apr 27, 2025 12:27 IST

    సభకు ఏర్పాట్లు పూర్తి



  • Apr 27, 2025 12:26 IST

    గన్ పార్క్ వద్ద నివాళులర్పిస్తున్న బీఆర్ఎస్ నేతలు



  • Apr 27, 2025 12:26 IST

    సభకు బయలుదేరిన ఇబ్రహీంపట్నం కార్యకర్తలు



  • Apr 27, 2025 12:25 IST

    తెలంగాణ భవన్ లో రజతోత్సవ వేడుకలు



Advertisment
Advertisment
Advertisment