Telangana: సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్‌ పై స్పందించిన టీజీ డీజీపీ!

ప్రణీత్‌ హనుమంతు అనే యూట్యూబర్‌ చేసిన ఓ వీడియో పై టాలీవుడ్‌ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్‌ చేయగా.. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ ఆ యూట్యూబర్ మీద కేసు నమోదు చేసినట్లు వివరించారు.

New Update
Telangana: సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్‌ పై స్పందించిన టీజీ డీజీపీ!

Telangana: ఈరోజుల్లో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటే..కొందరు మాత్రం దానిని దుర్వినియోగం చేయడానికి ఉపయోగించి దాని పరువు తీస్తున్నారు. ఏది మాట్లాడాలి..మాట్లాడకూడదు అనే జ్ఙానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగుతన్నారు.

ఈ క్రమంలోనే ప్రణీత్ హనుమంతు అనే ఓ తెలుగు యూట్యూబర్‌ ఆన్‌లైన్‌లో ఓ డిబేట్‌ను చేపట్టాడు. ఇందులో కొందరు వ్యక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రీ, కూతుళ్ల మధ్య సాగే ఓ వీడియోపై నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు పేలారు. అసభ్య కామెంట్స్‌ చేసి, అదేదో గొప్ప పని చేస్తున్నట్లు విరగబడి నవ్వారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా అయ్యింది.

ఈ వీడియో చూసిన హీరో సాయి ధరమ్ తేజ్‌ సోషల్‌ మీడియా వేదికగా అగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఉండే మృగాల నుంచి పేరెంట్స్‌ తమ పిల్లల్ని కాపాడుకోవాలంటూ విజ్ఙప్తి చేశారు. సదరు వీడియోను పోస్ట్ చేస్తూ సుదీర్ఘంగా ఓ పోస్ట్‌ పెట్టారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్‌ అయ్యింది. దీనిపై ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం స్పందించారు.ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయి తేజ్‌ కు ధన్యవాదాలు తెలిపారు.

పిల్లల భద్రత నిజానికి అత్యంత ప్రాధాన్యత అంశం అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫమ్‌లలో పిల్లల ఫొటోలు, వీడియోలు దుర్వినియోగాన్ని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.అయితే తాజాగా ఈ సంఘటనపై తెలంగాణ పోలీసులు రియాక్ట్ అయ్యారు. అసభ్యకరమైన రీతిలో సంభాషించినన యూట్యూబర్‌పై వెంటనే కేసు నమోదు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

తేజ్‌ పోస్ట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ తెలంగాణ డీజీపీ అధికారిక పేజీ నుంచి మరో పోస్ట్‌ ను పోస్ట్‌ చేశారు. బాలిక పై అసభ్యకరమైన రీతిలో అనుచితవ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసినట్లు తెలిపారు. చిన్నారులను కాపాడేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు.

Also read: నర్సింగ్‌ హోమ్‌ లో భారీ అగ్ని ప్రమాదం..ఊపిరాడక 10 మంది మృతి! 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Movie Second Song: అర్జున్ సర్కార్ కొత్త సాంగ్ ఊరమాస్.. ‘హిట్ 3’ సెకండ్ సింగిల్ కెవ్ కేక

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న కొత్త సినిమా ‘హిట్ 3’. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రీట్ అందించారు. ఇందులోని సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్’ అంటూ ఈ సాంగ్ సాగుతుంది.

New Update
Abki Baar Arjun Sarkaar Lyrical song released

Abki Baar Arjun Sarkaar Lyrical song released Photograph: (Abki Baar Arjun Sarkaar Lyrical song released)

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న కొత్త సినిమా ‘హిట్ 3’. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రీట్ అందించారు. ఇందులోని సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్’ అంటూ ఈ సాంగ్ సాగుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు