/rtv/media/media_files/2025/04/01/AjJqLOnwEA6fVPOpRNcv.jpg)
Vivo Y300 Pro+ and Vivo Y300t
ప్రముఖ టెక్ బ్రాండ్ Vivo తాజాగా తన లైనప్‌లో ఉన్న ఫోన్లను లాంచ్ చేసింది. Vivo Y300 Pro+, Vivo Y300t అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్లు ముఖ్యంగా భారీ బ్యాటరీతో వచ్చి అట్రాక్ట్ చేశాయి. Vivo Y300 Pro+ ఫోన్ 7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. అదే సమయంలో Vivo Y300t ఫోన్ 44W ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 50MP డ్యూయల్-కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఆరిజిన్ OS 5, ఫోన్ స్పీడ్ కోసం శక్తివంతమైన ప్రాసెసర్‌లు అందించారు.
ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
Vivo Y300 Pro+ Price
Vivo Y300 Pro+ ఫోన్ 4 వేరియంట్లలో లాంచ్ అయింది. 8GB RAM - 128GB స్టోరేజ్ వేరియంట్ CNY 1,799 ( రూ.21,200)
8GB RAM - 256GB స్టోరేజ్ వేరియంట్ CNY 1,999 ( రూ. 23,500)
12GB RAM - 256GB స్టోరేజ్ వేరియంట్ CNY 2,199 ( రూ. 25,900)
12GB RAM - 512GB స్టోరేజ్ వేరియంట్ CNY 2,499 (రూ. 29,400)గా కంపెనీ నిర్ణయించింది.
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. సింపుల్ బ్లాక్, మైక్రో పౌడర్, స్టార్ సిల్వర్‌లలో లభిస్తాయి. ఇప్పటికే చైనా మార్కెట్లో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. దీని సేల్ ఏప్రిల్ 3 నుండి ప్రారంభమవుతుంది.
vivo Y300t and Y300 Pro+ launched with massive batteries https://t.co/LU5QOhd9mX pic.twitter.com/nqeepFCXo1
— Smartprix (@Smartprix) March 31, 2025
Vivo Y300t Price
Vivo Y300t ఫోన్ కూడా నాలుగు వేరియంట్లలో లాంచ్ అయింది.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
8GB RAM - 128GB స్టోరేజ్ వేరియంట్ ధర చైనాలో CNY 1,199 (దాదాపు రూ. 14,100)
8GB RAM - 256GB స్టోరేజ్ వేరియంట్ ధర చైనాలో CNY 1,299 (దాదాపు రూ. 15,300)
12GB RAM - 256GB స్టోరేజ్ వేరియంట్ ధర చైనాలో CNY 1,499 (సుమారు రూ. 17,600)
12GB RAM - 512GB స్టోరేజ్ వేరియంట్ ధర చైనాలో CNY 1,699 (దాదాపు రూ. 20,000)గా నిర్ణయించబడింది.
ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
ఈ ఫోన్ మూడు కలర్‌లలో లభిస్తుంది. అందులో ఓషన్ బ్లూ, బ్లాక్ కాఫీ, రాక్ వైట్ షేడ్స్ ఉన్నాయి.
ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే Vivo అధికారిక స్టోర్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
(vivo-mobiles | latest-telugu-news | telugu-news)