/rtv/media/media_files/2025/04/12/GYFtcKiP65SUUpxY9Bwm.jpg)
Vivo V50e 5G
వివో కంపెనీ భారతదేశంలో తన Vivo V50e 5G ఫోన్‌ను విడుదల చేసింది. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఫస్ట్ సేల్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇంతలో ఈ ఫోన్ ప్రీ-బుకింగ్ మొదలయ్యాయి. Vivo V50e 5G స్మార్ట్‌ఫోన్‌ను ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. దీని ధరపై తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో మరింత తక్కువకే దీనిని పొందవచ్చు.
Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్
Vivo V50e 5G Sale Date
వివో V50E స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. దీని మొదటి సేల్ ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. వివో V50e ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది కాకుండా.. వివో అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!
Vivo V50e 5G Price and Offers
మొదటి సేల్ సమయంలో Vivo V50E స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్ ద్వారా డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. HDFC, SBI బ్యాంక్ కార్డులపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ 10 శాతం ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో Vivo V50E ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. అందులో 8GB + 128GB వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది. ఇప్పుడు దీనిపై రూ. 5000 ప్రత్యక్ష తగ్గింపు ఉంది. ఈ తగ్గింపు తర్వాత ఈ వేరియంట్‌ను కేవలం రూ.28,999కి కొనుక్కోవచ్చు. అలాగే 8GB + 256GB వేరియంట్ ధరపై కూడా రూ. 5,000 తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ రూ.35,999కి బదులుగా రూ.30,999కి అందుబాటులో ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. అవి సఫైర్ బ్లూ, పెర్ల్ వైట్.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
Vivo V50e 5G Specifications
Vivo V50e 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.77-అంగుళాల AMOLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్క్రీన్‌ను కలిగి ఉంది. MediaTek Dimensity 7300 SoC ప్రాసెసర్‌తో కూడిన ఈ ఫోన్ Android 15 ఆధారిత FuntouchOS 15 స్కిన్‌పై రన్ అవుతుంది. HDR 10+ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. ఇది నీరు - ధూళి నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
ఫోన్‌లో OIS మద్దతుతో 50MP సోనీ IMX882 ప్రధాన కెమెరా ఉంది. ఇది కాకుండా వెనుక కెమెరాలో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5600mAh బ్యాటరీతో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 9 గంటలు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
(tech-news | tech-news-telugu | telugu tech news | latest-telugu-news | telugu-news)