Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

ఫ్లిప్‌కార్ట్ ఉగాది స్పెషల్‌గా 4కె స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్‌లు ప్రకటించింది. మోటో ఎన్విజన్ X 43ఇంచుల టీవీని రూ.22,999లకు కొనుక్కోవచ్చు. అలాగే Acer 55 inch స్మార్ట్‌టీవీని రూ.30,999లకు, Mi 43 inch టీవీని రూ.26,999లకు సొంతం చేసుకోవచ్చు.

author-image
By Seetha Ram
New Update
Ugadi special Flipkart announce huge discounts on Moto, Acer, and Mi branded 4k smart TVs

Ugadi special Flipkart announce huge discounts on Moto, Acer, and Mi branded 4k smart TVs

Ugadi 2025 Tv Offers: ఒక మంచి 4కె స్మార్ట్‌టీవీని(4K SmartTV) కొనుక్కుని ఇంట్లో పెట్టి.. థియేటర్ అనుభవాన్ని పొందాలనుకుంటున్నారా?.. కానీ అధిక ధరల కారణంగా మీ ప్లాన్ మార్చుకుంటున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో టాప్ బ్రాండెడ్ 4కె టీవీలను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

Also Read: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

Motorola Envision X 43 Inch QLED Ultra HD

మోటరోలా కంపెనీ మొబైల్ ఫోన్ విభాగంలో మాత్రమే కాకుండా టీవీల విభాగంలో కూడా దూసుకుపోతుంది. ఈ కంపెనీలోని ‘మోటరోలా ఎన్విజన్ X 43 అంగుళాల QLED అల్ట్రా HD’ టీవీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అన్ని తగ్గిపులతో ఈ టీవీని కేవలం రూ. 22,999 ధరకు కొనుక్కోవచ్చు. ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ టీవీ 4k సదుపాయంతో వస్తుంది. 4k ఎనేబుల్డ్ డిస్‌ప్లేతో పాటు, టీవీ 20W సౌండ్ అవుట్‌పుట్‌ను కూడా కలిగి ఉంది. 

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

Acer Pro Series 55 inch 4k LED Smart LED

‘ఏసర్ ప్రో సిరీస్ 55 అంగుళాల 4k LED స్మార్ట్ LED’ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది 36W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. 3840×2160 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ టీవీలో Google TV 5.0, Dolby Audio ఉన్నాయి. ఒక మంచి థియేటర్ అనుభవాన్ని పొందాలంటే ఇది చాలా బెటర్. ఇది ఫ్రేమ్‌లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది అల్ట్రా 4k HD TV ఇది. ప్రస్తుతం ఈ టీవీ ధర రూ. 30,999గా ఉంది. 

Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

Mi 43 inch Ultra HD 4k with Dolby Audio

డాల్బీ ఆడియోతో Mi 43 అంగుళాల అల్ట్రా HD 4k టీవీ మరో సరసమైన ఎంపిక. ఇది 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇది దాదాపు 30W సౌండ్ సిస్టమ్‌తో వస్తుంది. వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లను పొందొచ్చు. ప్రస్తుతం ఈ 43 అంగుళాల టీవీ దాదాపు రూ.26,999 ధరకు అందుబాటులో ఉంది. 

Also read: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు

Acer Super Series 43 Inch with QLED Ultra HD 4k

ఏసర్ సూపర్ సిరీస్ 43 అంగుళాల QLED అల్ట్రా HD 4k టీవీ బెస్ట్ ఆప్షన్. ఇది 3840 x 2160 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. దాదాపు 80W సౌండ్ అవుట్‌పుట్ అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్, డిస్నీ హాట్‌స్టార్‌లకు మద్దతు ఇస్తుంది. దీనిని కేవలం రూ.25,999 సరసమైన ధరకే కొనుక్కోవచ్చు.

(tv offers | latest-telugu-news | telugu-news | UGADI 2025)

Advertisment
Advertisment
Advertisment