/rtv/media/media_files/2026/04/09/tcs-2026-04-09-21-37-37.jpg)
TCS Salary Hike From April 1st, compnay Announces Annual Appraisal For Employees
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు కొత్త ఆర్థిక సంవత్సరంలో తీపి కబురు చెప్పింది. ఏప్రిల్ 1 నుండి అన్ని గ్రేడ్లలోని ఉద్యోగులకు వార్షిక వేతన పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. గతేడాది మధ్యస్థాయి, దిగువ స్థాయి ఉద్యోగులకు సగటున 4.5 శాతం నుండి 7 శాతం వరకు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 10 శాతం వరకు వేతనాలు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈసారి పెంపు ఎంత శాతం ఉంటుందనేది కంపెనీ వెల్లడించలేదు.
Also Read: కొత్త పార్టీ పెట్టనున్న రాఘవ్ చద్దా ?.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ ఉద్యోగులను మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు TCS చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్హుమల్ తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో స్కిల్స్ మెరుగుపరుచుకునే దిశగా కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. గత త్రైమాసికంలో (Q4 FY26) కొత్తగా 2,300 మందిని నియమించుకుంది. దీంతో ఈ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 5,84,519కి చేరుకుంది.
Also Read: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. హర్మూజ్‌లో రోజుకు 15 నౌకలకు మాత్రమే పర్మిషన్
మరోవైపు ఆర్ధికంగా కూడా TCS అద్భుతమైన వృద్ధి సాధించింది. మార్చిలో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 12.2 శాతం పెరిగి రూ. 13,718 కోట్లు నమోదైంది. ఆదాయం 9.6 శాతం వృద్ధి చెంది రూ. 70,698 కోట్లకు చేరింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం అటు ఉద్యోగుల్లో కాన్ఫిడెన్స్‌ను నింపడమే కాక, ఇతర ఐటీ కంపెనీలకు కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది.
Follow Us