/rtv/media/media_files/2025/03/24/VGtDw0wyP3SIwN8Bi6ZP.jpg)
iPhone 16 price drop
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ లో కిక్కిచ్చే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 2024లో యాపిల్ కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు అదే సిరీస్ లోని బేస్ వేరియంట్ పై ఊహించని భారీ తగ్గింపు అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ అద్భుతమైన ఆఫర్‌తో ఐఫోన్ ప్రియులకు చిరునవ్వులు తెచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, ఆఫర్, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి
iPhone 16 price drop
ఐఫోన్ 16 మొత్తం 3 వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో అమెజాన్ లో 128జీబీ వేరియంట్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. దీని అసలు ధర రూ.79,900 ఉండగా.. ఇప్పుడు 8శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అంటే దాదాపు రూ.6,500 తగ్గింపు లభిస్తుందన్నమాట. ఈ తగ్గింపుతో ఐఫోన్ బేస్ వేరియంట్ ను రూ.73,400లకే కొనుక్కోవచ్చు.
ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
అలాగే ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ సైతం లభిస్తోంది. పలు బ్యాంక్ కార్డులపై రూ.4000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ తగ్గింపుతో రూ.69,400లకే ఇది లభిస్తుంది. ఇది కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఏకంగా రూ.46,100లకే ఊహించని ఎక్స్ఛేంజ్ తగ్గింపు ఉంది. ఈ తగ్గింపు మొత్తం లభిస్తే ఐఫోన్ 16 బేస్ వేరియంట్ కేవలం రూ.23,300లకే సొంతం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే.. పాత ఫోన్ మంచి కండీషన్ లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తుంది. లేదంటే మీ జేబులోంచి మరింత డబ్బులు పెట్టాల్సిందే.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!
(tech-news | telugu tech news | iphone-16 | mobile-offers | latest-telugu-news)