/rtv/media/media_files/2025/03/29/czb7HPtuVsm8T6YjTRji.jpg)
Google Pixel 9a India sale
టెక్ బ్రాండ్ గూగుల్ తన Google Pixel 9a స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల భారత్‌లో లాంచ్ చేసింది. తాజాగా దీని సేల్ తేదీని గూగుల్ అధికారికంగా ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 16 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఫస్ట్ సేల్‌లో భారీ బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు. దాదాపు రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో సహా మరిన్ని లాంచ్ ఆఫర్‌లతో వస్తుంది.
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
గూగుల్ పిక్సెల్ 9a సేల్
Google Pixel 9a సేల్ ఏప్రిల్ 16 నుండి ఇండియాలో ప్రారంభమవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కంపెనీ గూగుల్ పిక్సెల్ 9a ను ఒకే వేరియంట్‌లో విడుదల చేసింది. ఇందులో 8GB RAM - 256GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 49,999 ధరకు అందుబాటులో ఉంది. దీనిని లాంచ్ ఆఫర్‌లలో భాగంగా.. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై దాదాపు రూ. 3,000 తక్షణ తగ్గింపు పొందొచ్చ. ఇది భారతదేశంతో పాటు మరిన్ని దేశాలలో సేల్‌కు వస్తుంది.
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
Google Pixel 9a ఫీచర్లు
Google కొత్త Pixel 9aని సరసమైన ధరకు ప్రీమియం ఫీచర్లతో విడుదల చేసింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ Google Tensor G4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. సేఫ్టీ విషయానికొస్తే.. ఇది Titan M2 సెక్యూరిటీ చిప్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో నడుస్తుంది.
Also Read: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. బహిష్కరిస్తున్నమంటూ మెయిల్స్!
Pixel 9a ఫోన్ 7 సంవత్సరాల OS అప్‌డేట్‌లతో వస్తుంది. అంతేకాకుండా ఇది డ్యూయల్ రియర్ కెమెరాకు మద్దతు ఇస్తుంది. ఇందులో 48MP ప్రైమరీ షూటర్, 13MP అల్ట్రావైడ్ షూటర్‌తో వస్తుంది. AI ఫీచర్లను కలిగి ఉంది. ఈ మొబైల్ వేగవంతమైన ఛార్జింగ్‌తో పాటు ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. 23W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో దాదాపు 5100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
Also Read: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి
(mobile-offers | UGADI 2025 | latest-telugu-news | telugu-news)