/rtv/media/media_files/2025/04/13/yH1xsKBlpMhY76TYRL7U.jpg)
tv offers today
ఒక పెద్ద డిస్‌ప్లేతో కొత్త స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. 40 అంగుళాల స్క్రీన్‌తో కూడిన పెద్ద స్మార్ట్ టీవీని ప్రస్తుతం రూ. 15,000 లోపు కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. ఆన్‌లైన్ రిటైలర్ అయిన ఫ్లిప్‌కార్ట్ 40 అంగుళాల స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులను అందిస్తుంది. తక్కువ ధరకే లభించే 40-అంగుళాల స్మార్ట్ టీవీలో USB పోర్ట్‌లు, HDMI పోర్ట్‌లు, భారీ RAM, OTT యాప్ సబ్‌స్క్రిప్షన్‌లు, అదిరిపోయే సౌండ్ అవుట్‌పుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Thomson Alpha 40-inch
థామ్సన్ 40-అంగుళాల స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో థామ్సన్ ఆల్ఫా QLED ధర రూ. 19,999 గా ఉండగా.. కంపెనీ 35% ధర తగ్గింపును ప్రకటించింది. ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌తో కేవలం రూ. 12,999కి దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో కంపెనీ 36 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ QLED ప్యానెల్ 60 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఇది 4GB స్టోరేజ్, 512MB RAMని కలిగి ఉంది. ఇందులో రెండు USB పోర్ట్‌లు, మూడు HDMI పోర్ట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం రూ. 5400 ఎక్స్ఛేంజ్‌ను అందిస్తోంది.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
Infinix 40-inch Smart TV Y-Series
ఇన్ఫినిక్స్ Y-సిరీస్ నుండి 40-అంగుళాల స్మార్ట్ టీవీ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ ధర రూ. 21,999. కానీ కొనుగోలుదారులు 36% తగ్గింపును పొందవచ్చు. ఈ డీల్‌తో మీరు ఈ 40-అంగుళాల డిస్ప్లే టీవీని కేవలం రూ. 13,999కి కొనుగోలు చేయవచ్చు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
KODAK Smart TV, 40-inch
స్మార్ట్ టీవీ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో కోడాక్ ఒకటి. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు KODAK 9XPRO 40-అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 26,999 కు అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్ టీవీని కొనుగోలుపై 40% తగ్గింపు లభిస్తుంది. ఈ ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత రూ. 14,999 కి కొనుక్కుని ఇంటికి పట్టికెళ్లొచ్చు. ఇంకా రూ. 5400 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఈ స్మార్ట్ టీవీ 1GB RAMను కలిగి ఉంది. 8GB స్టోరేజ్‌తో వస్తుంది. బ్లూటూత్, Wi-Fi వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ టీవీలో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఇందులో రెండు USB పోర్ట్‌లు, మూడు HDMI కనెక్షన్‌లను అందిస్తుంది.
(tv offers | latest-telugu-news | telugu-news | offers | Flipcart | flipkart )