Cheapest Cars: రయ్ రయ్.. 5.44 లక్షలకే 7 సీట్ల కారు.. పెద్ద ఫ్యామిలీకి పండగే- మైలేజ్ ఎంతంటే?

మార్కెట్‌లో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరిగిపోయింది. అందులో మారుతి ఈకో ఒకటి. ఇది రూ.5.44 లక్షలకు అందుబాటులో ఉంది. లీటర్ పెట్రోల్‌కు 20కి.మీ మైలేజీ అందిస్తుంది. దీని తర్వాత రెనాల్ట్ ట్రైబర్ ఉంది. దీనిని రూ.6.09 లక్షలతో కొనుక్కోవచ్చు.

New Update
Renault Triber and Maruti Eeco offers

Renault Triber and Maruti Eeco offers

తక్కువ ధరలో అద్భుతమైన 7 సీట్ల కార్లు మార్కెట్‌లోకి రావడంతో చాలా మంది వాటిపైనే ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఫ్యామిలీ 7సీటర్ కార్లపైనే ఫోకస్ పెడుతున్నారు. దీంతో వాటికి మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇప్పుడంతా హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లను వదిలి చౌకైన 7 సీటర్ కార్ల వైపు పరుగులు పెడుతున్నారు. అందువల్లే ప్రముఖ కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్ పై ఎక్కువగా దృష్టి పెట్టాయి. ప్రస్తుతం అతి తక్కువ ధరలో లభించే 7 సీటర్ కార్లపై ఓ లుక్కేద్దాం.

ఇది కూడా చూడండి: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

మారుతి ఈకో

భారతదేశంలో చౌకైన 7 సీట్ల కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెద్దగా బడ్జెట్‌ లేని వారి కోసం మార్కెట్‌లోకి అందుబాటు ధరలో కార్లు వస్తున్నాయి. మీ బడ్జెట్ కూడా తక్కువగా ఉంటే.. మారుతి ఈకో మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇది 5, 7 సీట్లలో అందుబాటులో ఉంది. ఇది 81 PS పవర్, 104 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మోడల్ 1.2L లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. పెట్రోల్ మోడలే కాకుండా CNG ఆప్షన్ కూడా ఇవ్వబడింది. 

ఇది కూడా చూడండి: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

పెట్రోల్ మోడ్‌లో ఈ కారు లీటర్ పెట్రోల్‌కి 20 kmpl మైలేజీని అందిస్తుంది. అదే సమయంలో CNG మోడ్‌లో ఇది 27 km/kg మైలేజీని ఇస్తుంది. సేఫ్టీ కోసం మారుతి ఈకోలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన EBD, చైల్డ్ లాక్, స్లైడింగ్ డోర్లు, డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో అందించారు. Eeco ధర రూ. 5.44 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 

ఇది కూడా చూడండి: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

రెనాల్ట్ ట్రైబర్

రెనాల్ట్ ట్రైబర్ 7 మందికి సభ్యులకు మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇందులో 5+2 సీటింగ్ లేఅవుట్ ఉంది. అందులో పెద్దవారు 5గురు, చిన్న పిల్లలు ఇద్దరు సులభంగా కూర్చోవచ్చు. ఈ కారు 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది Apple Car Play, Android Autoకి కనెక్టింగ్‌కు మద్దతు ఇస్తుంది. 

ఇది కూడా చూడండి: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్

సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంజిన్ విషయానికొస్తే.. ట్రైబర్ 999సీసీ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 72 PS పవర్, 96 Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ అండ్ AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 20 km మైలేజ్ అందిస్తుంది. ఈ కారు ధర రూ.6.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

(cheapest cars | offers | car offers | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

OnePlus 12 Price Drop: వన్‌ప్లస్ 12జీబీ ర్యామ్ ఫోన్‌పై రూ.19వేల భారీ డిస్కౌంట్.. ఫీచర్లు పిచ్చ క్లాస్!

అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ఫోన్‌ 12/256GB వేరియంట్ రూ.64,999కి బదులుగా రూ.51,998కి లిస్ట్ అయింది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.6వేలు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో మరింత తగ్గుతుంది. మొత్తంగా రూ.19వేల డిస్కౌంట్ వస్తుంది.

New Update
OnePlus 12 Offers

OnePlus 12 Offers

ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ మార్కెట్‌లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుంది. కొత్త కొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ మొబైల్ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా తన ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించి మరింత కస్టమర్లను తనవైపుకు తిప్పుకుంటుంది. తాజాగా మరో ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు ప్రకటించింది. OnePlus 12పై భారీ డిస్కౌంట్ ఇస్తుంది. Amazon గత సంవత్సరం లాంచ్ అయిన OnePlus ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. డిస్కౌంట్‌లతో పాటు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ తగ్గింపులు కూడా పొందొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

OnePlus 12 Offers

OnePlus 12 ఫోన్‌లోని హైవేరియంట్‌పై ఆఫర్ ఉంది. దీని 12GB RAM - 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.64,999 ఉండగా.. ఇప్పుడు రూ.51,998కి లిస్ట్ చేయబడింది. ఆసక్తిగల కస్టమర్లు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై ఫ్లాట్ రూ.6,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ బ్యాంక్ డిస్కౌంట్‌తో వన్‌ప్లస్ 12 ధర రూ.45,998 అవుతుంది. అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

పాత ఫోను లేదా ఇప్పటికే వాడుతున్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల రూ.46,100 వరకు తగ్గుతుంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ మోడల్, దాని పెర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంటుంది. కాగా ఈ ఫోన్ జనవరి 2024లో రూ. 64,999 (12GB/256GB వేరియంట్)కి ప్రారంభించబడింది. అంటే మొత్తంగా ఈ ఫోన్‌పై దాదాపు రూ.19 వేల తగ్గింపు లభిస్తుంది. 

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

OnePlus 12 Specifications

OnePlus 12ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1440x3168 పిక్సెల్‌లుగా ఉంది. కంపెనీ ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ని అందించింది. ఈ ఫోన్‌లో 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5400 mAh బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP65 రేటింగ్‌ను కలిగి ఉంది. 

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 64 మెగాపిక్సెల్ రెండవ కెమెరా, 48 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇక ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికొస్తే.. ఇందులో 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు అందించారు. 

Advertisment
Advertisment
Advertisment