Asian Games 2023:నేపాల్ మీద గెలిచి సెమీ ఫైనల్స్ చేరిన టీమ్ ఇండియా ఆసియా క్రీడలు 2023లో భారత్ నేపాల్ మీద గెలిచి సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్ళింది. 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుపొందాలంటే 203 పరుగులుచేయాల్సి ఉండగా నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది. By Manogna alamuru 03 Oct 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి India at Asian Games Reached semifinals: ఆసియా క్రీడల్లో మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నేపాల్, భారత్ (India Vs Nepal) మధ్య జరిగాయి. ఈ మ్యాచ్ లో యువ ట్రీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 203 భారీ స్కోరును నేపాల్ ముందు ఉంచింది. తర్వాత లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన నేపాల్ 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసింది. దీపేంద్ర సింగ్ ఐరీ 32 పరుగలతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నేపాల్ టీమ్ బ్యాటర్లు మ్యాచ్ గెలవడానికి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. వికెట్లు పడుతున్నా సిక్స్‌ల మీద సిక్స్‌లు బాదారు. ఒకదశలో నేపాట్ జట్టు మ్యాచ్ గెలుస్తుందేమో అనుకున్నారు కూడా. అయితే టీమ్ ఇండియా బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో గెలుపును సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో ఆవేశ్ కాన్ 3, రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీసుకోగా, అర్షదీప్ సింగ్ 2, సాయి కిశోర్ ఒక వికెట్ తీసుకున్నారు. అంతకు మందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు అదిరిపోయే శుభారంభం లభించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) నెమ్మదిగా ఆడితే.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ధనాధన్ ఆటతో రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్ ఎవరైనా సరే.. తగ్గేదేలే అన్నట్టు సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. యశస్వికి రుతురాజ్ మంచి సహకారం అందించాడు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతూ 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. తరువాత వచ్చిన తిలక్ వర్మ, జితేష్ లు నిరాశపర్చారు. సింగిల్ డిజిట్లకే పెవిలయన్ బాట పట్టారు. అయితే ఒక పక్క వికెట్లు పడుతున్న యశస్వి మాత్రం తన జోరును కంటిస్యూ చేస్తూనే ఉన్నాడు. 48 బంతుల్లో సెంచరీని అధిగమించాడు. ఇక చివర్లో వచ్చిన రింకూ సింగ్, శివమ్ దూబేలు కూడా మెరుపులు మెపిపించడంతో టీమ్ ఇండియా భారీ స్కోరును సాధించింది. రింకూ సింగ్( 15 బంతుల్లో 37పరుగులు నాటౌట్) అదరగొట్టాడు. టీమ్ ఇండియా కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 202 పరుగులు భారీ స్కోరును చేసింది. నేపాల్ బౌలర్లలో దీపేంద్రసింగ్ ఐరీ రెండు వికెట్లతో సత్తా చాటాడు. సందీప్ లామిచానే, సోమపాల్ చెరో వికెట్ తీశారు. Also Read: మరోసారి తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్..!? #india #nepal #sports #yashaswi-jaiswal #asian-games-2023 #asian-games #india-at-asian-games-2023 #quarter-finals #indian-cricket-team-in-asian-games మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి