Team India Schedule: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియా బిజీ షెడ్యూల్ ఇదే.. ఎక్కడ ఎవరితో ఆడుతుందంటే.. ICC ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, టీం ఇండియా చాలా బిజీగా ఉండబోతోంది. ముందుగా టీమిండియా తదుపరి సిరీస్ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనుంది. ఆ తర్వాత టీమిండియా ఏయే దేశాలతో ఆడుతుందనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 11 Aug 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Team India Schedule: ఇటీవల శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడింది టీమిండియా. టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా, వన్డే సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. ఈ వన్డే సిరీస్‌తో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కోసం టీమ్ ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. కానీ శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి, టీమిండియా తన సన్నాహాలను మెరుగుపరుచుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఒక నెల రెస్ట్.. శ్రీలంక పర్యటన తర్వాత భారత క్రికెట్ జట్టు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోనుంది. ICC ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, టీం ఇండియా చాలా మ్యాచ్‌లు ఆడవలసి ఉంది. అందులో జట్టుకు తగిన విధంగా సన్నద్ధమయ్యే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు టీమిండియా తదుపరి సిరీస్ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో (Bangladesh) జరగనుంది. ఆ తర్వాత టీమిండియా ఏయే దేశాలతో ఆడుతుందనే వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా ఆ తర్వాత సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. టెస్ట్ సిరీస్ షెడ్యూల్.. మొదటి టెస్ట్ - చెన్నై (సెప్టెంబర్ 19 నుండి 23 వరకు) రెండవ టెస్ట్ - కాన్పూర్ (సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 1 వరకు) 1వ T20I- ధర్మశాల (6 అక్టోబర్) రెండో టీ20- ఢిల్లీ (అక్టోబర్ 9) 3వ T20I - హైదరాబాద్ (అక్టోబర్ 12) న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్.. Team India Schedule: బంగ్లాదేశ్ తర్వాత న్యూజిలాండ్ జట్టు (New Zealand) భారత్‌లో పర్యటించనుంది. ఈ సమయంలో ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. న్యూజిలాండ్ భారత పర్యటన అక్టోబర్ 16 నుంచి ప్రారంభం అవుతుంది.. కాగా, చివరి టెస్టు నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. సిరీస్ షెడ్యూల్ మొదటి టెస్ట్ - బెంగళూరు (అక్టోబర్ 16 నుండి 20) రెండో టెస్టు - పూణె (అక్టోబర్ 24-28) మూడో టెస్టు - ముంబై (నవంబర్ 1 నుంచి 5 వరకు) దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ ఈ రెండు జట్లకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికాకు బయలుదేరుతుంది. ఈ టూర్‌లో 4 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 8 నుంచి సిరీస్ ప్రారంభం కానుండగా, చివరి మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది. సిరీస్ షెడ్యూల్ 1వ T20I - డర్బన్ (నవంబర్ 8) రెండవ T20I- గక్బర్హా (నవంబర్ 10) 3వ T20I- సెంచూరియన్ (నవంబర్ 13) నాల్గవ T20I- జోహన్నెస్‌బర్గ్ (నవంబర్ 15) అందరి దృష్టి ఆస్ట్రేలియా పర్యటనపైనే Team India Schedule: ఏడాది చివర్లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. రెండు జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ జరగనుంది, ఇందులో డే నైట్ టెస్ట్‌తో పాటు మొత్తం 5 టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ వచ్చే ఏడాది ప్రారంభం వరకు కొనసాగనుంది. సిరీస్ షెడ్యూల్ మొదటి టెస్ట్ - పెర్త్ (నవంబర్ 22 నుండి నవంబర్ 26 వరకు) రెండవ టెస్ట్ - అడిలైడ్ (డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 10 వరకు) మూడవ టెస్ట్ - బ్రిస్బేన్ (డిసెంబర్ 14 నుండి డిసెంబర్ 18 వరకు) నాల్గవ టెస్ట్ - మెల్బోర్న్ (డిసెంబర్ 26 నుండి డిసెంబర్ 30) ఐదవ టెస్ట్ - సిడ్నీ (జనవరి 3 నుండి జనవరి 7 వరకు) ఇంగ్లాండ్ సిరీస్‌తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది Team India Schedule: వచ్చే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో భారత జట్టు తొలి సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య 5 టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. సిరీస్ షెడ్యూల్ 1వ టీ20 - చెన్నై (జనవరి 22) రెండో టీ20 - కోల్‌కతా (జనవరి 25) 3వ టీ20 - రాజ్‌కోట్ (జనవరి 28) నాలుగో టీ20- పూణె (జనవరి 31) 5వ T20I - ముంబై (ఫిబ్రవరి 2) మొదటి వన్డే - నాగ్‌పూర్ (ఫిబ్రవరి 6) రెండో వన్డే - కటక్ (ఫిబ్రవరి 9) మూడో వన్డే - అహ్మదాబాద్ (ఫిబ్రవరి 12) #bangladesh #team-india #champions-trophy-2025 #cricket-news #new-zealand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి