TCS-Infosys:టీసీఎస్, ఇన్ఫోసిస్ సంస్థల్లో భారీగా ఉద్యోగులకు ఉద్వాసన..ఈ సారి ఎంతమందంటే! ప్రముఖ ఐటీ కంపెనీలు అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన క్వార్టర్ ఫలితాలను ప్రకటించాయి.ఈ రెండు కంపెనీలలో పని చేసే ఉద్యోగుల సంఖ్య తగ్గింది.ఈ ఏడాది ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీలు తెలిపాయి. By Bhavana 12 Jan 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి TCS-Infosys: దేశంలో కరోనా ప్రభావం ఆర్థిక పరిస్థితులు ఇంకా ప్రముఖ కంపెనీలను వీడట్లేదు. గతేడాది మొత్తం మీద ఉద్యోగుల కోత తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది కూడా ఇంకా ఉద్యోగుల కోతలు మొదలైనట్లు కనిపిస్తుంది. దేశంలోని రెండు ప్రముఖ ఐటీ కంపెనీలు అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన క్వార్టర్ ఫలితాలను ప్రకటించాయి. ఉద్యోగులు కొరత.. ఈ రెండు కంపెనీలలో పని చేసే ఉద్యోగుల సంఖ్య తగ్గింది. టీసీఎస్ హెడ్ కౌంట్ లో మొత్తంగా 5860 మంది ఉద్యోగులు కొరత ఉండగా...ఇన్ఫోసిస్ లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య అయితే 6101 కి తగ్గిపోయింది. టీసీఎస్ లో ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇది వరుసగా రెండో సారి. డిసెంబర్ 31, 2023 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 603,305 కి తగ్గింది. కాలేజీ క్యాంపస్ ల నుంచి.. గతేడాది ఉద్యోగుల సంఖ్య 1627 మందికి పెరగగా..ఇప్పుడు 7530 కి తగ్గింది. అట్రిషన్ రేటు 13.3 శాతానికి తగ్గిందని టీసీఎస్ చీఫ్ హెచ్ ఆర్ మిలింద్ తెలిపారు. ఈ క్రమంలోనే కొత్త ఉద్యోగులను కాలేజీ క్యాంపస్ ల నుంచి కంపెనీ రిక్రూట్ చేసుకుంటుందని తెలిపారు. టీసీఎస్ లో చేరేందుకు చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని TCS ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. టీసీఎస్ , ఇన్ఫోసిస్ బాటలోనే గూగుల్ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంజినీరింగ్ , హార్డ్‌వేర్ తో పాటు మరికొన్ని విభాగాల్లో వందల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. సంస్థ వ్యయ నియంత్రణల్లో భాగంగానే గూగుల్ తన సంస్థలోని పలు టీమ్స్ లో ఉద్యోగాల కోతలను అమలు చేస్తోంది. పిక్సెల్, నెస్ట్, ఫిట్ బిట్ కోసం వాయిస్ అసిస్టెన్స్ ఇచ్చే టీమ్ హార్డ్ వేర్ టీమ్ ల్లో పలువురిని ఉద్యోగాల నుంచి గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. తాజా లే ఆఫ్ ప్రక్రియ లో భాగంగా మొత్తం ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నామో గూగుల్ ఇంకా ప్రకటించలేదు. Also read:అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ..11 రోజుల దీక్ష చేపట్టిన ప్రధాని మోడీ! #google #tcs #infosys #layoffs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి