Trump Tariffs: మళ్ళీ టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్.. వాటిపై 25% సుంకాలు!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ సుంకాల మోత మోగించారు. ఈ సారి భారీ ట్రక్కులు మీద 25 శాతం సుంకాలను విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ సుంకాల మోత మోగించారు. ఈ సారి భారీ ట్రక్కులు మీద 25 శాతం సుంకాలను విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
ఇంతకు ముందు యూరోపియన్ యూనియన్..ఇప్పుడు జీ 7 దేశాలు..అమెరికా పద్ధతి ఏంటో అంతు పట్టకుండా ఉంది. ఒకవైపు భారత్ తో వాణిజ్య సంబంధాలను మెరుగు పర్చుకుంటామని చెబుతూనే మరోవైపు జీ7 దేశాలకు భారత్ పై అదనపు సుంకాలను విధించాలని ఒత్తిడి చేస్తోంది.
అమెరికా ఆదాయాన్ని పెంచాలని.. ఆర్థిక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలని అధ్యక్షుడు ట్రంప్ కలలు కన్నారు. సుంకాలను విధించారు. కానీ ఇప్పుడు ఆ దెబ్బ అమెరికా కంపెనీలకు తగులుతోంది. చైనా 10 శాతం ప్రతీకార సుంకాల దెబ్బకు కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.
ట్రంప్ రష్యాపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారు. భారత్, చైనాతో పాటు ఆయా దేశాల దిగుమతులపై100 శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (EU) దేశాలను కోరినట్లు తెలస్తోంది.
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం అదనపు సుంకాలను విధించారు. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోతుంది అనుకున్నారు. కానీ దానికి రివర్స్ లో బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ పెరుగుతూ పోతోంది. దీనికి కారణం భారత పెట్టుబడిదారులే అని చెబుతున్నారు.
ఏది ఏమైనా రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేదే లేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.అమెరికా అదనపు సుంకాల భరాన్ని తగ్గించేందుకు కొత్తవ్యూహాలను రూపొందిస్తున్నామని తెలిపారు.దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటామన్నారు.