ఆంధ్రప్రదేశ్ AP: తిరుపతిలో దారుణం.. వాచ్మెన్ భార్య హత్య..! తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ నగర్లో వాచ్మెన్ భార్య దారుణ హత్యకు గురయింది. దుండగులు ఇంట్లో చొరబడి ఆమె గొంతు కోసి హతమార్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం భర్త రామిరెడ్డి కడపకు వెళ్లినట్లు తెలుస్తోంది. అంధురాలైన కుమార్తెతో ఇంట్లో ఉన్న వాచ్మెన్ భార్యపై దాడి చేసి చంపారు. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rape Case: తిరుపతిలో దారుణం.. 6 ఏళ్ల బాలికను 65 ఏళ్ల వృద్దుడు ఏం చేశాడంటే! తిరుపతి జిల్లా మూలకండ్రిగలో 6ఏళ్ల బాలికను 65ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటిదగ్గర ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఆశచూపి బలరామయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక చికిత్స పొందుతుండగా పరారిలోవున్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. By srinivas 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురి మృతి! ఏపీ తిరుపతిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బీఎన్ కండ్రిగ మండలం పార్లవల్లి గ్రామం వద్ద కారు, బైక్ ను ఢీకొట్టింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati : సీబీఐ పేరుతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యేకు రూ. 50 లక్షల టోకరా సీబీఐ పేరుతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడికి ఓ మహిళ ఫోన్ చేసి చేసింది. మీ ఖాతా నుంచి మనీల్యాండరింగ్ జరిగిందని బెదిరించింది. ఆమెతో పాటూ మరో నిందితుడు కలిపి జయదేవనాయుడి దగ్గర నుంచి రూ.50 లక్షలు దోచుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పాకాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By Manogna alamuru 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వెంటనే చర్యలు తీసుకోండి.. ఇలా ఉంటే సహించేది లేదు.. కలెక్టర్ ఆగ్రహం..! తిరుపతిలో పారిశుధ్యలోపంపై కలెక్టర్ వెంకటేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే..తిరుపతి నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుపతి పారిశుద్ధ కార్మికుల పనితీరుపై మండిపడ్డారు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే వారికి అధిక ప్రాధాన్యత టీటీడీ ఈవో! తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు ఇక నుంచి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు ఇతర జంతువుల సంచారాన్ని గుర్తించేందుకు మరికొన్ని ట్రాప్ కెమరాలను ఏర్పాటు చేయాలన్నారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమలలో ఘోర ప్రమాదం.. కారు టైర్ పగిలి..నలుగురి పరిస్థితి విషమం! తిరుమలలో ఘోర ప్రమాదం జరిగింది. స్వామి వారి దర్శనానికి వస్తున్న తమిళనాడు భక్తులు ఈ ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డారు. కారు టైరు పగిలి..కరెంట్ స్తంభానికి ఢీకొనడంతో నలుగురు భక్తుల పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన రాజీనామా! తిరుమల తిరుపతి టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన గత ఆగస్టులోనే టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి లేఖ పంపించారు. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gas Leak : గ్యాస్ లీక్.. 30 మందికి పైగా తీవ్ర అస్వస్థత.! తిరుపతి జిల్లా రేణిగుంట ఏర్పెడు సీఎంఆర్ కర్మాగారంలో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. అస్వస్థతకు గురైన కార్మికులను రేణిగుంట బాలాజీ హాస్పిటల్ కు తరలించారు. By Jyoshna Sappogula 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn