Telangana Rains : తెలంగాణలో నేడు వర్షాలు.. వాతావరణశాఖ కీలక ప్రకటన!
మంగళవారం నాడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని తెలిపారు.
మంగళవారం నాడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని తెలిపారు.
ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలోని నిర్మల్, ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రంగా కొనసాగిన వాయుగుండం... పూరీకి సమీపంలో ఒడిశా తీరాన్ని దాటినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు 2 గంటల నుంచి వర్షం దంచికొడుతుంది. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల ఇళ్లు కూలిపోయిన వారికి ప్రాధాన్యత కింద మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 7వేల ఇల్లు నేలమట్టం అయినట్లు కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
TG: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
నేటి నుంచి మరో 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.ఆ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు.
హైదరాబాద్ లో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు రోడ్లపై నడిచేటప్పుడు, వెహికల్స్ పై వెళ్లే సమయంలో మ్యాన్ హోల్స్ ను చూసుకోని జాగ్రత్తగా ఉండాలని సూచించింది.