Heavy Rains : ఏపీ, తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్! ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలోని నిర్మల్, ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. By Nikhil 10 Sep 2024 | నవీకరించబడింది పై 10 Sep 2024 09:10 IST in తెలంగాణ ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి Heavy Rains : ఏపీలో వర్షాలు తగ్గడం లేదు. అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా ఉత్తరకోస్తా, ఉభయగోదావరి జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్స్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు ఉభయగోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఫ్లాష్‌ఫ్లడ్స్ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోస్తాంధ్రలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తాలో భారీ వర్షాలు ఉంటాయని చెబుతోంది. సముద్రం వెంట ఈదురుగాలులుసముద్ర తీరం వెంట భారీగా ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో కుంభ వృష్టి కురుస్తోంది. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక చోట్ల పంటపొలాలు నీట మునిగాయి. తెలంగాణలోనూ భారీ వర్షాలుమరోవైపు తెలంగాణలోనూ ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను సైతం వర్షం వీడడం లేదు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. #heavy-rains #telangana-rains #andhra-pradesh-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి