Magunta Parvathamma : ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఒంగోలు మాజీ ఎంపీ, మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్ను మూశారు.
ఒంగోలు మాజీ ఎంపీ, మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్ను మూశారు.
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తాను రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్. ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ, ఏపీ టూరిజం ఛైర్మన్‌గా బాలాజీ, APIIC ఛైర్మన్‌గా రామరాజును నియమించింది. ప్రకటించిన మొత్తం 20పదవుల్లో టీడీపీకి 16, జనసేనకి 3, బీజేపీకి ఒకటి దక్కాయి.
టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఓ శుభవార్త చెప్పారు.ఈ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను అమలు చేస్తామని తెలిపారు. దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందిస్తామని..ఆయన తెలిపారు.
గుంటూరు జైలు వద్ద మాజీ సీఎం జగన్ తో యూనిఫామ్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సెల్ఫీ దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఆ కానిస్టేబుల్ కు ఛార్జిమెమో ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.
బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చేందుకు గత నాలుగు రోజుల నుంచి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ ఇంజనీర్ల బృందం కూడా రంగంలోకి వచ్చింది. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో నిమగమైంది.
వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు.
విద్యాకమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత పెంచాలన్నారు. ప్రత్యేకమైన యాప్ ద్వారా విద్యాకమిటీల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. పెండింగ్ లో ఉన్న ఆయాల జీతాలు, కెమికల్ బిల్స్ చెల్లిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే అందులో ఏపీలో మూడు కారిడార్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మూడు కారిడార్ల పై 28 వేల కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది.