15 శాతం వాటా ఇవ్వాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే జేసీ సంచలన వ్యాఖ్యలు తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి మద్యం షాపు నిర్వాహకులు 15 శాతం వాటా ఇవ్వాల్సిందేనని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారం చేసేవారు 15 శాతం ఇస్తే.. తాను 20 శాతం ఇచ్చి తాడిపత్రిని అభివృద్ధి చేస్తానన్నారు. By Kusuma 13 Oct 2024 in రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో మద్యం షాపు నిర్వాహకులు నుంచి కమిషన్ ఇవ్వాలని హుకూం జారీ చేశారు. తాడిపత్రిలో జరిగే పేకాట, జూదాల నుంచి 15 శాతం వాటా అభివృద్ధికి ఇవ్వాలని ఆదేశించారు. ఇక్కడ ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ 15 శాతం వాటా మాత్రం తాడిపత్రి అభివృద్ధికి ఇవ్వాల్సిందేనన్నారు. ఇది కూడా చూడండి: హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఇవి ముఖ్యం! ప్రత్యర్థులు ఊరు వదిలి పోవాల్సిందే.. తాడిపత్రి నియోజకవర్గాన్ని తాను 20 శాతం ఇచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి ఎన్ని కోట్లు అయిన ఖర్చు చేస్తానని బహిరంగంగా తెలిపారు. తన ప్రత్యర్థులు నియోజకవర్గం వదిలి వెళ్లిపోవాని హెచ్చరించారు. 1952లో తాడిపత్రికి మా నాన్నే తొలి ఎమ్మెల్యే అని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని జేసీ అన్నారు. వైసీపీ పాలనలో లారీలు, బస్సులను పోగొట్టుకున్నానని తెలిపారు. ఇది కూడా చూడండి: స్లమ్ ప్రాజెక్టే సిద్ధిఖీ హత్యకు కారణమా? అసలేంటి ఈ ప్రాజెక్ట్? #tdp #jc-prabhakar-reddy #tadipatri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి