AP Government : నామినేటెడ్ పదవులు ప్రకటించిన ఏపీ సర్కార్

ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్. ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ, ఏపీ టూరిజం ఛైర్మన్‌గా బాలాజీ, APIIC ఛైర్మన్‌గా రామరాజును నియమించింది. ప్రకటించిన మొత్తం 20పదవుల్లో టీడీపీకి 16, జనసేనకి 3, బీజేపీకి ఒకటి దక్కాయి.

author-image
By V.J Reddy
New Update
CHANDRABABU

Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టులపై జరుగుతున్న చర్చ తెర దింపారు సీఎం చంద్రబాబు (Chandrababu). తాజాగా పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో మొత్తం 20 మంది ఉన్నారు. అందులో టీడీపీ నుంచి 16 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి పదవులు దక్కాయి. ఇటీవల ఇదే అంశంపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే కూటమి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. కాగా జనసేన మాత్రం తమకు ఐదు నుంచి ఏడు పదవులు ఇవ్వాలని, తమకు మూడు పదవులు కావాలని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా జనసేనకు మూడు, బీజేపీకి ఒక పదవి దక్కింది.  ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం పొత్తు ధర్మంలో భాగంగా పార్టీ గెలుపు కోసం పని చేసిన వారికి ఈ జాబితాలో ప్రాధాన్యత ఇచ్చారు. 

Also Read :  భారత్‌లో మంకీ పాక్స్‌ క్లాడ్‌ 1 బీ తొలి కేసు... !

ప్రభుత్వం ప్రకటించిన జాబితా...

  1. వక్ఫ్ బోర్డు – అబ్దుల్ అజీజ్
    2. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP)- అనిమిని రవి నాయుడు
    3. AP హౌసింగ్ బోర్డు – బత్తుల తత్తయ్య బాబు
    4. AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR) – బోరగం శ్రీనివాసులు
    5. AP మారిటైమ్ బోర్డ్ – దామచెర్ల సత్య
    6. సీడప్ (ఏపీలో ఉపాధి కల్పన & సంస్థ అభివృద్ధి కోసం సొసైటీ) – దీపక్ రెడ్డి
    7. 20 పాయింట్ ఫార్ములా – లంక దినకర్ (BJP)
    8. AP మార్క్‌ఫెడ్ – కర్రోతు బంగార్రాజు
    9. AP స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – మన్నె సుబ్బారెడ్డి
    10. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) – మంతెన రామరాజు
    11. AP పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ – నందం అబద్దయ్య
    12. AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – నూకసాని బాలాజీ
    13. APSRTC ఛైర్మన్ – కొనకళ్ల నారాయణ.. APSRTC వైస్ చైర్మన్ – పీఎస్ మునిరత్నం
    14. AP అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పీలా గోవింద సత్యనారాయణ
    15. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పిల్లి మాణిక్యాల రావు
    16. AP స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ – పీతల సుజాత
    17. A.P. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ (APMSME DC) – తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)
    18. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ – తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన)
    19. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC) – వజ్జా బాబు రావు
    20. AP టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (APTIDCO) – వేణుములపాటి అజయ కుమార్ (జనసేన)

Also Read :  లడ్డూ మీద జోకులా..! కార్తీ పై పవన్ ఆగ్రహం..!

Nominated Posts List

Also Read :  సీఎంకు హైకోర్టు బిగ్ షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు