Latest News In Telugu Supreme Court: వారికి పరిహారం రూ.30 లక్షలు చెల్లించాల్సిందే.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు మురుగును శుభ్రం చేసే కార్మికులు మృతి చెందింతే వారి కుటుంబాలకు రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాన్యువల్ స్కావెంజర్‌గా పని చేస్తూ శాశ్వత వైకల్యానికి గురైన బాధితులకు రూ.20లక్షలు పరిహారంగా ఇవ్వాలని సూచనలు చేసింది. అలాగే ఇతర రకాల వైకల్యానికి గురైన వారికి రూ.10లక్షల చొప్పున ఇవ్వాలని పేర్కొంది. ఈ వృత్తిలో కొనసాగేవారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలిపింది. By B Aravind 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: 'ఇన్ని రోజులు ఏం చేశారు'.. బీఆర్ఎస్కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. బీఆర్ఎస్ పార్టీకి ఓ ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల గుర్తుల్లో కారును పోలి ఉన్న గుర్తులను రద్దు చేయాలంటూ ఇటీవలె బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసింది. అయితే వీటిపై తాజాగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ రెండు పిటిషన్లను కొట్టివేసింది. మునుగోడు ఉపఎన్నికల్లో.. హైకోర్టు కొట్టివేసిన పిటిషన్‌పై ఆలస్యంగా వచ్చారని.. అధికార పార్టీ అయ్యుండి కూడా.. 240 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారంటూ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టడం కుదరదని తేల్చి చెప్పింది. అయితే హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది By B Aravind 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Supreme court: చంద్రబాబు కేసులను వచ్చే నెల 8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ములాఖత్ ను పెంచాలని చంద్రబాబు వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో ఇప్పుడు విచారణ అవసరం లేదని పిటీషన్ ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు. దాంతో పాటూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్ర బాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే నెల అంటే నవంబర్ 8కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు నవంబరు 9 న వింటామని ధర్మాసనం చెప్పింది. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big News: బీఆర్ఎస్కు సుప్రీంకోర్టు షాక్.. ఎన్నికల్లో కష్టాలు తప్పేలా లేవుగా..! తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎన్నికల గుర్తుల కేటాయింపునకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 'రోడ్డు రోలర్', 'చపాతి మేకర్' లాంటి ఎన్నికల గుర్తులను కేటాయుంచద్దని, ఆ మేరకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం.. బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Same sex marriage:మా పోరాటం ఆగిపోదు..సుప్రీంకోర్టు ముందే ఉంగరాలు మార్చుకున్న స్వలింగ జంట స్వలింగ వివాహాలకు నో చెబుతూ నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని చెప్పింది. స్వలింగ వివాహాం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. అలా పెళ్ళి చేసుకోవడం వారి ప్రాథమిక హక్కు కాదని తెల్చి చెప్పింది. దీంతో భారత దేశంలో స్వలింగ సంపర్కులు తీవ్ర నిరాశ చెందారు. ఓ స్వలింగ జంట అయితే ఏకంగా కోర్టు ఎదుటే తమ నిరసనను తెలిపారు. ఉంగరాలు మార్చుకుని తమ నిశ్చితార్ధం చేసుకున్నారు. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. మధ్యంతర బెయిల్ కు నో! స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. By Nikhil 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: స్వలింగ సంపర్కుల వివాహాలకు సుప్రీంకోర్టు నిరాకరణ స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2తో తీర్పు వెల్లడించింది. By B Aravind 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: సేమ్ సెక్స్ వివాహాలపై.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతిఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంటుందని.. అందుకోసం ప్రభుత్వం కూడా స్వలింగ వివాహాలకు న్యాయపరమైన హోదా ఇవ్వాలంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. By B Aravind 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:సుప్రీంలో చంద్రబాబుకు ఊరట లభించేనా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు పిటిషన్ మీద నేడు సుప్రీంకోర్టులో ఫైనల్ విచారణ జరగనుంది. తనపై నమోదుచేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ బాబుసుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద వాదనలు జరుగుతాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ ను దృష్టిలో పెట్టుకుని బాబు తరుఫు లాయర్లు వాదించనున్నారు. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn