Delhi: ఢిల్లీని ముంచిన వర్షాలు..100కు పైగా విమనాలు బంద్
విపరీతమైన వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేశాయి. ఈరోజు తెల్లవారుఝామున కురిసిని పెద్ద వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు 100కు పైగా విమానాలు నిలిచిపోయాయి.
విపరీతమైన వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేశాయి. ఈరోజు తెల్లవారుఝామున కురిసిని పెద్ద వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు 100కు పైగా విమానాలు నిలిచిపోయాయి.
నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అరేబియా సముద్రంలో వాయుగుండం కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం పీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో 6 రోజుల్లో గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు 20 మంది మృతి చెందారు. దాదాపు 100కి పైగా ఇళ్లు నీట మునిగాయి. బలమైన గాలులకు చెట్లు ఇళ్లపై పడటంతో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా కొందరు మరణించినట్లు తెలుస్తోంది.
నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆర్థిక రాజధాని ముంబైని కుడపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కరిసిన వర్షానికి అక్కడి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దారుల్లో చెట్లు కూలిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
భారీగా కురిసిన వర్షాలకు బెంగళూరు అతలాకుతలం అయ్యింది. ఎక్కడ చూసినా కూడా అంతా నీటిమయం కనిపిస్తోంది. అయితే రన్నింగ్ బస్సులో కూర్చొన్న సీట్ల వరకు వర్షం నీరు వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, నెల్లూరు, యానం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో నిజమాబాద్, మహబూబ్నగర్లో భారీగా వర్షాలు పడతాయి.