AP: నేడు జనసేనలోకి వైసీపీ కీలక నేతలు
AP: ఈరోజు జనసేనలో వైసీపీ కీలక నేతలు చేరనున్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య పార్టీలో చేరనున్నారు.
AP: ఈరోజు జనసేనలో వైసీపీ కీలక నేతలు చేరనున్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య పార్టీలో చేరనున్నారు.
కోలీవుడ్ హీరో కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. సంస్కృతి, సంప్రదాయాల విషయంలో ప్రజా ప్రతినిధులుగా మనం బాధ్యతతో ఉండాలని పేర్కొన్నారు.
తిరుపతి లడ్డూ వివాదంపై హీరో కార్తీ స్పందించిన తీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తన సోదరుడి విషయంలో సారీ చెబుతున్నట్లుగా సూర్య చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ సూర్య అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చింది కాదు. ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఈ ట్వీట్ చేశారు.
తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జరిగింది తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని అన్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై హీరో కార్తీ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హీరో కార్తీ.. పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించమని కోరారు.
హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే జరిగిన 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ తిరుమల లడ్డూ ఇష్యూ పై ఫన్నీగా సెటైర్లు వేశారు. దీంతో పవన్ లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని మండిపడ్డారు.
AP: పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను అక్టోబర్ 2న విరమించనున్నారు. 11 రోజుల దీక్షను తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకొని విరమిస్తారు. అనంతరం 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
AP: ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. మొత్తం 11 రోజులు దీక్ష చేయనున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షను ప్రారంభించనున్నారు.
కూటమి ప్రభుత్వం తెలుగు సినిమాను, ఇండస్ట్రీని ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.రాజకీయాలతో సంబంధం లేకుండా సీఎం చంద్రబాబు మద్దతునిస్తారని అన్నారు. దేవర సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీయార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.