Pawan Kalyan : కూటమి ప్రభుత్వం సినిమా కు ఎప్పుడూ అండగా ఉంటుంది‌‌

కూటమి ప్రభుత్వం తెలుగు సినిమాను, ఇండస్ట్రీని ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.రాజకీయాలతో సంబంధం లేకుండా సీఎం చంద్రబాబు మద్దతునిస్తారని అన్నారు. దేవర సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీయార్‌‌కు శుభాకాంక్షలు తెలిపారు.  

author-image
By Manogna alamuru
New Update
pawan kalyan shoot

Deputy CM Pawan Kalyan 

జూనియర్ ఎన్టీయార్ నటించిన దేవర సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. దీనికి సబంధించి ఆంధ్రాలో రోజుకు ఆరు షోలు వేసేందుకు కూటమి ప్రభుత్వం అనుతినిచ్చింది. ఇందుకు ఎన్టీయార్ సీఎం చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు థ్యాంక్స్ చెపుతూ ట్ఇట్టర్‌‌లోపోస్ట్ పెట్టారు. దీనికి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రిప్లై ఇచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్‌గానే ఉంటుంది  అని బదులు ఇచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా సినిమాను తాము గౌరవిస్తామని తెలిపారు. పాత ప్రభుత్వంలో తాము ఎప్పుడూ ప్రవర్తించమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో మాకు తెలుసు. అలా మేము ఎప్పుడూ చేయము అని చెప్పారు. దాంతో పాటూ జూనియర్ ఎన్టీయార్ కొత్త సినిమా దేవర రిలీజ్ సందర్భంగా అతనికి బెస్ట్ విషెస్ తెలిపారు వన్ కల్యాణ్.

Also Read: Deputy CM:మా తప్పును కాయి తండ్రీ..11 రోజల పాటూ పవన్ ప్రాయిశ్చిత దీక్ష

Advertisment
Advertisment
తాజా కథనాలు