AP: నేడు జనసేనలోకి వైసీపీ కీలక నేతలు AP: ఈరోజు జనసేనలో వైసీపీ కీలక నేతలు చేరనున్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య పార్టీలో చేరనున్నారు. By V.J Reddy 26 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి YCP Leaders: వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ కు ఎదురైన ఇక్కట్లే ఇప్పుడు జగన్ కు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీకి ఇప్పటికే పలువురు నేతలు రాజీనామా చేయగా.. తాజాగా మరికొంత మంది అదే బాటలో ప్రయాణిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు జనసేనలో చేరుతారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో రాగ.. వారు ఏ ఈరోజు చేరబోతున్నారనే దానిపై క్లారిటీ రాలేదు. కండువాలు కప్పనున్న పవన్.. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో విజయం సాధించి జనసేన రికార్డు కక్రియేట్ చేసింది. ఎన్నికల్లో విజయం సాధించిన జనసేనలో ప్రస్తుతం నేతల చేరికల పర్వం కొనసాగుతోంది. వైసీపీని విడి జనసేనలో చేరాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పార్టీలో చేరాలనుకునే వారికి పవన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు వైసీపీ నుండి జనసేనలో కీలక నేతలు చేరబోతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు.. సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు పవన్ కళ్యాణ్. జగన్ రియాక్షన్... ఇటీవల మీడియా సమావేశంలో నేతల ఫిరాయింపులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేతల రాజీనామాలతో వైసీపీ భూస్తాపితం అవ్వబోతుందా? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. తమ పార్టీ నేతలు రాజీనామా చేస్తే తమకు ఎలాంటి నష్టం వాటిల్లదని.. ఎవరి ఇష్టం వారిది అని అన్నారు. ఇంకా ఎవరైనా వైసీపీకి రాజీనామా చేసి వేరే పార్టీల్లోకి వెళ్ళాలి అనుకునే వారు వెళ్లిపోవచ్చని అన్నారు. వారి రాజీనామా వల్ల వైసీపీకి కాను తనకి కానీ ఎలాంటి నష్టం ఉందని.. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. యా సీనియర్ లీడర్ పోతాండాడు మా.. పోనిలే ఏమవుతుంది ఇంకో లీడర్ వస్తాడు.. @ysjagan ❤️👌🫡#YSJagan #YSRCP #AndhraPradesh #YSJaganTimes pic.twitter.com/xuTwwUo1WT — YS Jagan Times (@YSJaganTimes) September 20, 2024 #pawan-kalyan #balineni-srinivasa-reddy #janasena-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి