సెప్టెంబర్ 30 తర్వాత చూసుకుందాం.. పవన్ కు ప్రకాష్ రాజ్ వార్నింగ్

తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జరిగింది తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నలకు సమాధానమిస్తానని అన్నారు.

author-image
By Anil Kumar
New Update

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై సినీ నటుడు ప్రకాష్ రాజ్  ఇటీవల పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ..' డియర్ పవన్ కల్యాణ్, ఇది జరిగింది మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే, దోషులెవరో పట్టుకుని కఠినంగా శిక్షించండి. 

ఎందుకు దేశమంతటా భయాందోళనలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు? కేంద్రంలోని మీ మిత్రుల పుణ్యమా అని దేశంలో ఇప్పటికే మతపరమైన టెన్షన్లు చాలా ఉన్నాయి' అంటూ తిరుమల లడ్డూ వివాదంపై  ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ ను ఉద్దేశిస్తూ మాట్లాడారు.' ప్రకాశ్‌రాజ్‌.. విషయం తెలుసుకుని మాట్లాడండి.. సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ విషయం తెలుసుకుని మాట్లాడాలి.

 ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు' అని అన్నారు. ఇక దీనిపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ.. ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో పవన్ కు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

Also Read : ఓవర్సీస్ లో 'దేవర' ర్యాంపేజ్.. రిలీజ్ కు ముందే రికార్డులు

విదేశాల్లో ఉన్నా, వచ్చాక చూసుకుందాం..

" పవన్‌ కల్యాణ్‌ గారు.. ఇప్పుడే మీ ప్రెస్‌మీట్‌ చూశా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా.  ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి" అని అన్నారు.

 మరోవైపు శ్రీవారి లడ్డూలో కల్తీ జరగడంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ గుడి మెట్లను శుభ్రపరిచి అమ్మవారికి సేవ చేసుకున్నారు. అనంతరం మీడియా ముందు లడ్డూ వివాదం గురించి మాట్లాడారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

OG First Song Update: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు 'ఫైర్ స్టార్మ్' అప్‌డేట్.. ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేద‌ప్పుడే!

పవన్ కళ్యాణ్ 'OG' సినిమాపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. త్వరలో 'ఫైర్ స్టార్మ్' అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది అంటూ సినిమాపై హైప్ పెంచేసాడు. OG షూటింగ్ మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

New Update
OG First Song Update

OG First Song Update

OG First Song Update: ఒక పోస్టర్, ఒక్క గ్లింప్స్‌తోనే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపిన మూవీ 'OG' ఎంతటి అంచనాలను పెంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆయన రాజకీయాల బిజీతో 'OG' షూటింగ్‌కు బ్రేక్ పడింది.

Also Read: హారర్ బాట పట్టిన నాగ చైతన్య.. 'NC 24' పై క్రేజీ అప్‌డేట్

అయితే, ఫ్యాన్స్‌ నిరాశపడుతున్న టైమ్ లో, సంగీత దర్శకుడు తమన్‌(Thaman) ఇచ్చిన తాజా అప్‌డేట్‌ మరోసారి  'OG'పై హైప్‌ పెంచేసింది. యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూలో తమన్‌ మాట్లాడుతూ – 'OG' సినిమాలో తమిళ స్టార్ సింబు పాడిన హై ఎనర్జీ సాంగ్‌ “ఫైర్ స్టార్మ్”పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ పాటను OG షూటింగ్ మళ్లీ మొదలయ్యే రోజే రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఫ్యాన్స్‌ ఈ పాట కోసం ఇప్పటికే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్  ఇది చార్ట్‌బస్టర్ హిట్ అవ్వాలని ఎంతో ఆశపడుతున్నారు.

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

గ్యాంగ్‌స్టర్ డ్రామాగా 'OG'..

OG సినిమా 1980ల కాలానికి సంబంధించిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో పవన్‌ సరసన ప్రియాంక అరూల్ మోహన్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హాష్మి, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరిష్ ఉత్తమన్, షామ్‌ లాంటి నటులు ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

ఇప్పుడు ప్రతి పవన్‌ అభిమాని మనసులో ఒక్కటే ప్రశ్న OG షూటింగ్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుంది? “ఫైర్ స్టార్మ్” ఎప్పుడు వస్తుంది? అని.. దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు!

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

Advertisment
Advertisment
Advertisment