Nellore:నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రవైట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఇందులో ఏడుగురు మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రవైట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఇందులో ఏడుగురు మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారని అన్నారు సీఎం జగన్. ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని.. కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడని పేర్కొన్నారు.
.కరీంనగర్ -సిరిసిల్ల బస్ లో దొరికిన పందెం కోడి మేటర్ గత నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. వేలం పాటలో ఎవరికి దక్కుతుందో అనుకున్న పందెం కోడి కాస్తా బ్లూ క్రాస్ అధికారుల చెంతకు చేరింది. దీంతో కథ సుఖాంతం అయ్యింది
మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన పందెం కోడి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ రోజు కోడి వేలంపాట మొదలుపెట్టేందుకు సిద్ధమైన ఆర్టీసీ అధికారులకు నెల్లూరుకు చెందిన మహేష్ అనే వ్యక్తి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. కోడి తనదేనని ఆధారాలతో ముందుకొచ్చాడు.
నెల్లూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం కాంట్రక్ట్ విధానం ప్రతిపాదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుండగా డిగ్రీ, పీజీతోపాటు సంబంధిత శాఖలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అప్లికేషన్ కు డిసెంబర్ 23 లాస్ట్ డేట్.
మిచౌంగ్ తుఫాన్ నెల్లూరుకు 440 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ నెల 5 న నెల్లూరు- మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.
సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయని తెలుస్తుంది. సూళ్లూరుపేట శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా ఓ వర్గం తయారు కావడంతో పార్టీలో చీలిక ఏర్పడింది.
ఏపీలో టీడీపీకి రోజురోజుకు ఆదరణం పెరుగుతోంది. భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రాంపై ప్రజలు ఎక్కువ ఆదరణం చూపిస్తున్నారు. ప్రజలు ఆదరణ చూసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని దీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.
సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్7, ఎస్8 బోగీల్లోకి ప్రవేశించిన దొంగలు.. అందినకాడికి ఎత్తుకెళ్లారు. అలాగే సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్లో కూడా చోరీ చేశారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎస్1, ఎస్2 బోగీల్లో దొంగతనం చేశారు. నిద్రిస్తున్న మహిళల మెడల్లో నుంచి బంగారు చైన్లు, ఆభరణాలను అపహరించారు. దీంతో తేరుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా అరుపులు, కేకలు పెట్టారు. దీంతో అలర్ట్ అయిన గార్డులు.. తెట్టు, కావలి రైల్వే పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశారు. బంగారం చోరీకి సంబంధించి ప్రయాణికులు తమ వివరాలను పోలీసులకు వివరించారు. ఈ మేరకు కావలిలో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గార్డు ఫిర్యాదుతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. స్థానిక పోలీసులకు కూడా సమచారం ఇచ్చారు. చోరీ జరిగిన ప్రాంతం సమీపంలోని గ్రామాలు, తదితర ప్రదేశాలను గాలిస్తున్నారు.