Abu Saifullah: లష్కరే తోయిబా కీలక కమాండర్ హతం
లష్కరే తోయిబా కీలక కమాండర్ అబు సైఫూల్లా హతమయ్యాడు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అతడిని కాల్చి చంపారు. సైఫుల్లా భారత్‌లో మూడు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు.
లష్కరే తోయిబా కీలక కమాండర్ అబు సైఫూల్లా హతమయ్యాడు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అతడిని కాల్చి చంపారు. సైఫుల్లా భారత్‌లో మూడు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు.
పహల్గామ్ దాడికి తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. కానీ అది చేయించింది పాక్ సైన్యమే అన్న ఫ్రూఫ్ ను భారత దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసా పాక్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని తేలింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత రోజే లష్కరే తోయిబా నేతతో బంగ్లా లీగల్ అడ్వైజర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. డాక్టర్ అసిఫ్ నజ్రుల్ లష్కరే తోయిబా నేత ఇజార్‌తో భేటీ అయ్యారని, పలు విషయాలపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే వీరు పహల్గాం దాడికి ముందు కలిశారని అంటున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ ఉగ్ర మాడ్యూల్‌కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. విదేశీ ఉగ్రవాదులను ఈ దాడి కోసం రప్పించారు.
అనంత్ నాగ్ లోని పహల్గామ్లో బైసరన్ లోయలో దారుణ మారణకాండకు తామే బాధ్యలము అంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. అయితే దీనికి సూత్రధారి మాత్రం లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ అని భావిస్తున్నారు.
పాకిస్థాన్ ఆర్మీలో డాక్టర్ తహవ్యూర్ హుస్సేన్ రాణా ఉగ్రవాదిగా మారాడు. 2008 ముంబై ఉగ్రదాడుల్లో కీలక పాత్ర అతనిదేనని NIA చెబుతోంది. రాణాకి కెనడా పౌరసత్వం ఉన్నందున ఇన్నీ రోజులు భారత్‌కు అప్పగించలేదు. దౌత్య సంబంధాలతో అమెరికా ఏప్రిల్ 10న రాణాని అప్పగించింది.
లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ శనివారం రాత్రి పాకిస్తాన్లో హత్యకు గురయ్యాడు. అబూ ఖతల్ ప్రయాణిస్తున్న కారులో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు చేశారు. పాకిస్థాన్ పంజాబ్‌లోని జీలం టౌన్లో అతనితోపాటు అనుచరుడిని కూడా కాల్చి చంపారు.
లష్కరే తోయిబాకు చెందిన ఓ వాంటెడ్ ఉగ్రవాది ఇండియాకు చిక్కాడు. దేశంలో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడి ఇక్కడి నుంచి పారిపోయిన అతడిని ఎట్టకేలకు రువాండాలో గుర్తించారు. నవంబర్ 27న ఎన్ఐఏ, సీబీఐ నిందితుడిని ఇంటర్‌పోల్ సహకారంతో ఇండియాకు రప్పించింది.