Tiktok: అమెరికాలో టిక్ టాక్ బంద్!
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికాలో తన సేవల్ని నిలిపివేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ నేరుగా యూజర్లకు తెలియజేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు సందేశాలు పంపింది.
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికాలో తన సేవల్ని నిలిపివేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ నేరుగా యూజర్లకు తెలియజేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు సందేశాలు పంపింది.
ఇరాన్ లో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్చి చంపాడు. ఆ తరువాత తనని తానూ కాల్చి చంపుకున్నాడు. కోర్డు భవనంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది
నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది చనిపోయారు. నైజర్ ప్రావిన్స్‌లోని సులేజా ప్రాంతానికి సమీపంలో కొంతమంది జనరేటర్ సాయంతో ఒక ట్యాంకర్ నుండి మరొక ట్రక్కుకు గ్యాసోలిన్‌ను బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పేలుడు జరిగింది.
మయన్మార్‌లో దారుణం చోటుచేసుకుంది. అక్కడి సైన్యం ఓ సాయుధ మైనార్టీ గ్రూప్ కంట్రోల్లో ఉన్న గ్రామంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా అనే ప్రావిన్స్‌లో గనిలో పనిచేస్తున్న 16 మంది కూలీలు కిడ్నాప్ అయ్యారు. ఆ తర్వాత సాయుధులు వాళ్లని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనేది ఇంకా తెలియలేదు.
గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ నుంచి అమెరికా ప్రభుత్వం డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. గతేడాది 900 రిక్వెస్టులు పెట్టి..2,253 మంది యూజర్ల డేటాను అమెరికా ప్రభుత్వం సేకరించిందని అందులో వివరించింది.
ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు చెప్పిన మాటలు ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.ఈ క్రమంలో కెనడా తరువాత ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన ఎంపీ అనితా ఆనంద్ పేరు వినపడుతుంది.