Myanmar : మయన్మార్‌లో దాడులు.. 40 మంది మృతి

మయన్మార్‌లో దారుణం చోటుచేసుకుంది. అక్కడి సైన్యం ఓ సాయుధ మైనార్టీ గ్రూప్ కంట్రోల్‌లో ఉన్న గ్రామంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు.

New Update
Air Strikes in Mayanmar

Air Strikes in Mayanmar

మయన్మార్‌లో దారుణం చోటుచేసుకుంది. అక్కడి సైన్యం ఓ సాయుధ మైనార్టీ గ్రూప్ కంట్రోల్‌లో ఉన్న గ్రామంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని స్థానిక స్వచ్ఛంద సంస్థ అధికారులు తెలిపారు. పశ్చిమ రఖైన్ రాష్ట్రంలోని అరకాన్ ఆర్మీ ఆధినంలో ఉన్న క్యౌక్ నీ మావ్ అనే గ్రామంపై ఈ దాడి జరిగినట్లు తెలిపారు. వందల ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. 

Also Read: భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి!

దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆ గ్రామంలో ఇంటర్నెట్‌ సర్వీసులు, మొబైల్ సిగ్నల్ సేవలు కూడా నిలిపివేశారు. ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో సైన్యం దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. 2021 ఫిబ్రవరిలో ఆంగ్‌ సాన్‌ సూచి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టి అక్కడి సైన్యం అధికారం లాక్కుంది. దీంతో అప్పటినుంచి సైనిక పాలనను వ్యతిరేంచేవారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. 

Also Read: ఈ నెల‌లోనే ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు చేస్తాం: ఉత్త‌రాఖండ్ సీఎం

ఎవరైనా సైన్యానికి ఎదురుతిరిగితే వాళ్లని అణిచివేసేందుకు పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తున్నారు. శాంతియుత చేసే నిరసనలను కూడా అణిచివేస్తున్నారు. దీంతో చాలామంది సైనిక పాలనను వ్యతిరేకిస్తూ ఆయుధాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సైన్యం వాళ్లపై మరింత దురాగతాలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ గ్రామంపై వైమానికి దాడులు చేసింది. ఈ దాడుల్లో 40 ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. దీంతో అక్కడ పరిస్థితులు ఇంకా ఎలాంటి తీవ్రతకు దారితీస్తాయో అనేదానిపై ఆందోళన నెలకొంది.  

Also Read: చైనాలో మళ్లీ కొత్త వైరస్ కలకలం.. వెలుగు చూసిన కొత్త వేరియంట్

Also Read: వీడు మామూలు 'గే' కాదు : 11 మందిని దారుణంగా.. వీపుపై ద్రోహి అని రాసి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tahawwur Rana: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!

ముంబై 26/11 దాడి ప్రధాన నిందితుడు తహవూర్ రాణాపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. రాణా ఇండియాకు చేరుకోగానే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైలులో బిర్యానీ పెట్టి విశ్రాంతి తీసుకోమని మర్యాదలు చేయొద్దని కోరుతున్నారు. 

New Update
rana mumbai

Mumbai Victims Tahawwur Rana case

Tahawwur Rana: ముంబై 26/11 దాడి ప్రధాన నిందితుడు తహవూర్ రాణాపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. రాణా ఇండియాకు చేరుకోగానే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైలులో బిర్యానీ పెట్టి విశ్రాంతి తీసుకోమని మర్యాదలు చేయొద్దని కోరుతున్నారు. 

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

2-3 నెలల్లో ఉరితీయండి..

ఈ మేరకు రాణా నేడు భారతదేశానికి చేరుకోనుండగా అతన్ని తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బాధితులు, దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. 'రాణా లాంటి ఉగ్రవాదులకు భారతదేశం ఎలాంటి సౌకర్యాలు కల్పించకూడదు. కసబ్‌కు ఇచ్చినట్లుగా బిర్యానీ లేదా విశ్రాంతి ఇవ్వకూడదు. అటువంటి ఉగ్రవాదుల కోసం ప్రత్యేక చట్టం చేయాలి. తద్వారా వారిని 2-3 నెలల్లో ఉరితీయవచ్చు' అని ఆ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలను కాపాడిన మహ్మద్ తౌఫిక్ అలియాస్ 'ఛోటు చాయ్ వాలా' అన్నారు.

ఉగ్రవాదుల గురించి సమాచారం..

ఇక 'రాణాను చివరకు భారతదేశానికి తిరిగి తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉగ్రవాదంపై భారతదేశం సాధించిన అతిపెద్ద విజయం ఇది. అందువల్ల, నేను చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశం, అమెరికా ప్రభుత్వాలకు నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇచ్చింది. రాణాను తీసుకువచ్చిన వెంటనే అతని నుంచి పాకిస్తాన్‌లో ఇప్పటికీ దాక్కున్న ఉగ్రవాదుల గురించి సమాచారం సేకరించాలి. రాణాకు వీలైనంత త్వరగా మరణశిక్ష విధించాలి' అని దాడి బాధితురాలు దేవిక నట్వర్‌లాల్ రోతవాన్ అన్నారు.

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

ఈ దాడిలో మరణించిన SRPF కానిస్టేబుల్ తండ్రి నిందితుడు  రాణాకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 16 సంవత్సరాల క్రితం జరిగిన ఊచకోత తర్వాత తాను అనుభవించిన మానసిక కుంగుబాటు గురించి ఆయన మాట్లాడారు. '166 మంది ప్రాణాలను బలిగొన్న దాడుల్లో నిందితులందరికీ కఠిన శిక్ష విధించడం అనేది ఉగ్రవాద దాడిలో మరణించిన పోలీసు అధికారులు, పౌరులకు నిజమైన నివాళి అవుతుంది. ఈ ఘోరమైన దాడిలో చాలా మంది మరణించారు. 16 సంవత్సరాల తర్వాత కూడా దాని ప్రతికూల ప్రభావం ఇప్పటికీ నా మనస్సులో ఉంది' అని ఎస్ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రాహుల్ షిండే తండ్రి సుభాష్ షిండే ఎమోషనల్ అయ్యారు.

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

ఎలా జరిగిందంటే..
2008 నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైకి చేరుకుని నగరంలోని అనేక ప్రాంతాలపై దాడి చేశారు. రైల్వే స్టేషన్, రెండు పెద్ద హోటళ్ళు, ఒక యూదు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడులు దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. ఇందులో 166 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ 10 మంది ఉగ్రవాదుల్లో ఒకరు  కసబ్ మాత్రమే సజీవంగా పట్టుబడ్డారు. కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. నవంబర్ 2012లో పూణేలోని యెర్వాడ జైలులో ఉరితీయబడ్డాడు.

Also Read: టాప్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీబ్యూటీ..

 telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment