/rtv/media/media_files/2025/01/09/MNFgwoEkQyceCo7kkREP.jpg)
Pakistan
ఇటీవల పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఓవైపు భద్రతా సిబ్బందిని కోల్పోతుండగా.. మరోవైపు కనీసం సామాన్య ప్రజలకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి ఉంది. అయితే తాజాగా పాక్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఓ గనిలో పనిచేస్తున్న 16 మంది కూలీలు కిడ్నాప్‌కు గురవ్వడం కలకలం రేపుతోంది.
Also Read: పట్టపగలే యువతిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి పొడిచి! (వీడియో వైరల్)
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఖైబర్ పఖ్తుంక్వా అనే ప్రావిన్స్‌లోని కొందరు కూలీలు యురేనియం, ప్లూటోనియం గనిలో పనిచేస్తున్నారు. అయితే కొందరు సాయుధులు అందులో పనిచేస్తున్న 16 మంది కూలీలను కిడ్నాప్ చేశారు. లక్కీ మార్వత్ జిల్లాలో అటమిక్ ఎనర్జీ మైన్ వైపు కూలీలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత సాయుధులు కూలీలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. అనంతరం వాళ్లు ప్రయాణించిన వాహనాన్ని కూడా తగలబెట్టారు. కిడ్నాప్ ఎవరు చేశారో అనేది ఇంకా తెలియలేదు. ఇంతవరకు కూడా ఏ మిలిటెంట్ గ్రూప్ దీనిపై ప్రకటన చేయలేదు.
Also Read: బంపరాఫర్ .. పిల్లల్ని కంటే రూ. 81 వేలు.. డోంట్ మిస్
ఇదిలాఉండగా నిషేధిత ఉగ్రసంస్థ అయిన తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఆ ప్రావిన్సులో చురుగ్గా ఉంటుంది. ఇక్కడ ఆల్‌ఖైదాతో సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన పలు ఉగ్రదాడుల వెనుక ఈ గ్రూప్ హస్తం కూడా ఉంది. ఈ దాడులు జరగడంతో ఖైబర్ పఖ్తుంఖ్వా హోంశాఖ గత ఏడాది ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. అలాగే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇటీవల పాక్ సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) ఆత్మహుతి దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.