Air India Flight: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?
గత 48 గంటల్లో మొత్తం 9 ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిలో కొన్ని ప్రయాణాన్ని రద్దు చేయగా.. మరికొన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి.
గత 48 గంటల్లో మొత్తం 9 ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిలో కొన్ని ప్రయాణాన్ని రద్దు చేయగా.. మరికొన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి.
దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వరుస వైఫల్యాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గుజరాత్లోని అహమ్మదాబాదులో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం గురంచి మరవక ముందే తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వాళ్లని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా 47 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీళ్లలో 24 మృతదేహాలను వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా కంపెనీ AI 171 నెంబర్ని భవిష్యత్లో విమానాకు కేటాయించకుడదని నిర్ణయించుకుంది. దీనికి బదులుగా AI 159 నెంబర్ను ఈ ఫ్లైట్కు పేరు పెట్టనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్లోని అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ఇండియాకు డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది.
అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొన్ని సెకన్లకే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం కూలిపోయింది. ఈ విమానంలో 242 మంది ఉండగా అందులో 241 మంది మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకరు మాత్రమే ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు.
ఎయిర్ ఇండియా ప్రమాదంలో చనిపోయిన ఎయిర్ మణిపూర్ హోస్టెస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నగాన్తోయ్ శర్మ(22) ఫ్లైట్ బయల్దేరే ముందు రీల్ చేసింది. ఆమె ఫొటోలు, వీడియోలు చూస్తూ కుటుంబ సభ్యులు గుండెలు పలిగేలా రోధిస్తున్నారు.
అహ్మదాబాద్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. దీనిపై ఏఏబీ దర్యాప్తు చేపట్టింది. బ్లాక్ బాక్స్ దొరికితేనే కానీ అసలు విషయం తెలియదు. కానీ విమాన ప్రమాదానికి ప్రధానంగా మూడు కారణాలు ఉండి ఉండొచ్చునని నిపుణులు చెబుతున్నారు.