ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!
భారత్ vs న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను కోట్ల మంది క్రికెట్ ప్రియులు ఆసక్తికరంగా వీక్షించారు. మ్యాచ్ మొదటి నుంచి లాస్ట్ వరకు జరిగిన హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్ vs న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను కోట్ల మంది క్రికెట్ ప్రియులు ఆసక్తికరంగా వీక్షించారు. మ్యాచ్ మొదటి నుంచి లాస్ట్ వరకు జరిగిన హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్ vs కివీస్ మధ్య మధ్య రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌ను క్రికెట్ ప్రియులు కోట్లలో చూస్తున్నారు. ఇవాళ కివీస్‌తో ఫైనల్ మ్యాచ్‌ను 84 కోట్లకు పైగా చూస్తున్నారు. ఇదొక పెద్ద రికార్డే అని చెప్పాండి.
కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో పడుతున్నట్లు తెలుస్తోంది. వరుస వికెట్లు కోల్పోతుంది. తాజాగా శ్రేయస్ అయిన కొద్ది సేపటికే అక్షర్ పటేల్ ఔటయ్యాడు. 40 బంతుల్లో 29 పరుగులు చేశాడు. క్రీజ్‌లోకి హార్దిక్ వచ్చాడు. ప్రస్తుతం భారత్ 42 ఓవర్లలో 203 పరుగులు చేసింది.
కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ అదరగొడుతోంది. క్రీజ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యార్ (38*), అక్షర్ పటేల్ (15*) నిలకడగా ఆడుతున్నారు. 3 వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు సాధించింది.
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజ్‌లోకి వచ్చారు. ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు. 17 ఓవర్లలో భారత్ 100 పరుగులు సాధించింది. రోహిత్(69*), గిల్ (29*) ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. భారత్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి భారత్ 93 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ (65*), గిల్ (23*) ఉన్నారు.
కివీస్ నిర్ధేశించిన 251 పరుగుల లక్ష్య ఛేదనకు భారత్ దిగింది. ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టేస్తున్నాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. 41 బాల్స్‌లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు గిల్ మెల్లి మెల్లిగా ఆడుతున్నాడు. భారత్ 10.1 ఓవర్లలో 65 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ మ్యాచ్ ఆరంభంలోనే అరుదైన రికార్డును సమం చేశాడు. దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్‌ను మరోసారి ఓడిపోయాడు. దీంతో విండిస్ దిగ్గజం బ్రయన్ లారా (1998-99) సీజన్లో వరుసగా 12 సార్లు టాస్ కోల్పోయిన రికార్డును అతడు ఈక్వల్ చేశాడు.
కివీస్ మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు సాధించింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్, బ్రేస్ వెల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మిగతా వారు చేతులెత్తేశారు. దీంతో భారత్ 252 టార్గెట్ ఛేదించాల్సి ఉంది.